iDreamPost
android-app
ios-app

ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాడు.. కానీ, ఆ ఒక్క పొరపాటే..!

ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాడు.. కానీ, ఆ ఒక్క పొరపాటే..!

అతనికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. డాక్టర్ అవ్వాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దీని కోసం స్కూల్ నుంచే బాగా చదివేవాడు. ఇక ఎప్పటికైనా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవలందించాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే గతేడాది నీట్ ఎంట్రెన్స్ కూడా రాశాడు. కానీ, కొన్ని మార్కుల వ్యవధిలోనే అతనికి ఎంబీబీఎస్ సీటు మిస్సైంది. అయితేనేమే.. మరో మార్గాన్ని వెతుక్కుని బీఏఎంస్ఎస్ లో చేరాడు. మరికొన్ని రోజుల్లో పరీక్షలు అనగా ఈ యువకుడు ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా విఠలాపురం గ్రామంలో జగదీష్ (23) అనే యువకుడు నివాసం ఉండేవాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. దీని కోసం బాగానే చదివేవాడు. ఇందులో భాగంగానే ఎంబీబీఎస్ సీటు కోసం గతేడాది నీట్ ఎంట్రాన్స్ కూడా రాశాడు. కానీ, అందులో జగదీష్ కు సీటు రాలేదు. దీంతో అతడు నిరుత్సాహ పడ్డాడు. అయినా సరే.. వెనకడుగు వేసేది లేదని మరో మార్గాన్ని వెతుక్కున్నాడు. దీంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) కోర్సులో చేరాడు.

ఇక వెంగళరావునగర్ పరిధిలోని జవహార్ నగర్ లో తన స్నేహితుడితో కలిసి ఓ రూమ్ లో ఉండేవాడు. కానీ, ఎంబీబీఎస్ లో సీటు రాలేదని జగదీష్ తరుచు బాధపడేవాడు. దీన్నే తలుచుకుంటూ కాలేజీకి కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఇక త్వరలో బీఏఎంఎస్ మొదటి ఏడాది పరీక్షలు జరగనున్నట్లు ప్రకటన వెలువడింది. కాలేజీకి వెళ్లని కారణంగా హాల్ టికెట్ ఇస్తారో లేదో అని లోలోపల భయపడిపోయాడు. దీంతో జగదీష్ రోజు రోజుకి మరింత ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో అతనికి ఏం చేయాలో తెలియక చనిపోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే.. జగదీష్ బుధవారం ఉదయం తన ఫ్రెండ్ కు వాట్సాప్ లో “నేను చనిపోతున్నానంటూ” మెసేజ్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు రూమ్ కు వెళ్లి చూడగా.. జగదీష్ గదిలోకి  అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అతడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఇక చేసేదేంలేక జగదీష్ స్నేహితుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్.. 24 గంటలు గడిచినా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి