iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్.. 24 గంటలు గడిచినా..

  • Published Jul 13, 2023 | 6:46 PM Updated Updated Jul 13, 2023 | 6:46 PM
  • Published Jul 13, 2023 | 6:46 PMUpdated Jul 13, 2023 | 6:46 PM
హైదరాబాద్ లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్.. 24 గంటలు గడిచినా..

హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి వరుస మిస్సింగ్ కేసులు పలువురిని భయందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టగా చివరికి కొందరు ఆత్యహత్య చేసుకుంటే, మరి కొందరు కిడ్నాప్ కు గురవుతున్నారు. అయితే, ఈ ఘటనలు మరువక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో బాలుడు అదృశ్యమయ్యాడు. ఇక అప్రమత్తమైన అతని తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో సాయి కిరణ్ (12) అనే బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే, ఇతడు బుధవారం రాత్రి చిట్టి డబ్బులు చెల్లించడానికి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన సాయి కిరణ్ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. చాలా సమయం గడిచిపోయింది. అతడు మాత్రం ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ అతని తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు. తమ బంధువులను కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్లు మా ఇంటికి రాలేదని చెప్పారు.

అంతటా వెతికినా సాయి కిరణ్ ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ బాలుడి తల్లిదండ్రులు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 24 గంటలు గడిచినా సాయి కిరణ్ ఆచూకి దొరక్కపోవడంతో అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. దీంతో పాటు మా కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: దారుణం: చికెన్ వండలేదని భార్యను చంపిన కసాయి భర్త

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş