iDreamPost
android-app
ios-app

ఇదేం దారుణం.. ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి ఏం చేసిందో తెలుసా?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఓ మహిళ ఎవరూ ఊహించిన పని చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ ఏం చేసిందంటే?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఓ మహిళ ఎవరూ ఊహించిన పని చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ ఏం చేసిందంటే?

ఇదేం దారుణం.. ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి ఏం చేసిందో తెలుసా?

ఆడపిల్ల ఇంటికి వెలుగు, ఆడ పిల్లలు సమాజానికి మూల స్తంభాలు అంటూ ఇలా రకాల రకాల సూక్తులు చెబుతూ ఉంటారు. కానీ, ఇవన్నీ ఆచరణలో అస్సలు సాధ్యం కాదు. పైగా ఆడపిల్ల పుడితే ఇష్టం లేకున్నా కొందరు తల్లిదండ్రులు మాత్రం.. పైకి నవ్వతు నటిస్తుంటారు. ఇది కాదనలేని వాస్తవం. ఇంకొందరైతే ఆడపిల్ల పుడితే చాలు.. ఏకంగా మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో, లేకుంటే ప్రసవం జరిగిన ఆస్పత్రిల్లోనే కూతురుని వదిలేసి వెళ్తుంటారు. ఇలాంటివి సమాజంలో చాలా చోట్ల జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలు మరువక ముందే.. హైదరాబాద్ నడిబొడ్డున మరో ఘటన వెలుగు చూసింది. ఆడపిల్ల పుట్టిందని ఓ మహిళ దారుణానికి పాల్పడింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా డబీల్ పూర్ కు చెందిన రేఖ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఈ నెల 6న హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక అదే రోజు సాయంత్రం ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిందని ఆ మహిళ నిరాశకు లోనైంది. దీంతో పాటు ఆ పాప 650 గ్రాముల బరువు మాత్రమే ఉండడం విశేషం. ఇంతే కాకుండా ఆ పసి బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడంతో ఆ మహిళ మరింత బాధపడింది. వెంటనే ఆస్పత్రి వైద్యులు ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఐసీయూలోకి తీసుకెళ్లారు.

ఇక ఇవన్నీ తెలుసుకున్న ఆ దంపతులు.. ఇలాంటి కూతురు వద్దు అనుకున్నారో ఏమో కానీ.. అదే రోజు ఆస్పత్రిలో కూతురిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫలితం లేకపోవడంతో ఆ చిన్నారి ఈ నెల 8న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ చిన్నారి తల్లిదండ్రులకు డాక్టర్లు అనేక సార్లు ఫోన్ చేశారు. కానీ, వాళ్లు ఎంతకు స్పందించలేదు. ఇక చేసేదేం లేక వైద్యులు.. చనిపోయిన ఆ చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆ తర్వాత ఈ ఘటనపై వైద్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ల ఫిర్యాదు మేరకు శిశువు తల్లిపై 317 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దీంతో పోలీసులు ఆ శిశువు తల్లిదండ్రుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఆనారోగ్యంతో ఆడపిల్ల పుట్టిందని అదే ఆస్పత్రిలోనే వదిలేసి చివరికి ఆ బిడ్డను దిక్కులేని చావు చేసిన ఈ దంపతుల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.