iDreamPost
android-app
ios-app

నోరు మూసి కూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు తీర్పు ఏంటో తెలుసా?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.

నోరు మూసి కూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు తీర్పు ఏంటో తెలుసా?

సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు చూస్తుంటే అసలు మనం బతుకుతున్నది మనుషుల మధ్యేనా అన్న అనుమానం రాక తప్పదు. కొందరు దుర్మార్గులు అయితే తల్లి, చెల్లి అని వావి వరసలు కూడా మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తండ్రి.. కన్న కూతురుని కూడా చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. అభం, శుభం తెలియని ఆ బాలిక నోరు మూసి ఆ పాడు పనికి తెర లేపాడు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధిత బాలిక తల్లి, ఇతర కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా నిందితుడికి దిమ్మతిరిగే శిక్ష విధించింది. ఇంతకు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ చంద్రయాణగుట్ట పరిధిలోని ఓ ప్రాంతంలో షేక్ రిజ్వాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ కూతురు (11) కూడా ఉంది. అయితే ఈ దుర్మార్గుడు తన కూతురిపై కన్నేశాడు. ఎలాగైన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇతగాడు ఆ సమయం కోసం ఎదురు చూశాడు. ఇకపోతే, గతేడాది డిసెంబర్ 12న అతని భార్య ఏదో పని మీద బయటకు వెళ్లింది. ఇదే మంచి సమయం అనుకున్న రిజ్వాన్.. ఎవరూ లేని టైమ్ లో తన కూతురుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలిక నోరు మూసి బలవంతంగా తన కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక తల్లి ఇంటికి తిరిగి రాగానే కూతురు తండ్రి చేసిన దారుణం గురించి పూర్తిగా వివరించింది.

ఆ బాలిక చెప్పిన మాటలు విన్న ఆ మహిళ.. ఒక్కసారిగా షాక్ గురైంది. పట్టరాని కోపంతో వెంటనే చంద్రయాణగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఇక భర్త రిజ్వాన్ చేసిన దారుణంపై ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ కేసును తాజాగా న్యాయస్థానం విచారించి నిందితుడికి శిక్ష విధించింది. కన్న కూతురిపై అత్యాచారం చేసినందుక గాను రిజ్వాన్ కు 25 ఏళ్ల పాటు జైలు శిక్షతో, రూ.5 వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పుతో బాధితురాలి తల్లి సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు సరైన శిక్ష పడిందని తెలిపినట్లు సమాచారం. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఈ నిందితుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి