iDreamPost
android-app
ios-app

హైదరాబాద్: జ్వరంతో క్లినిక్ వెళ్లిన మహిళ.. కానీ, అక్కడ జరిగిందేంటంటే?

హైదరాబాద్: జ్వరంతో క్లినిక్ వెళ్లిన మహిళ.. కానీ, అక్కడ జరిగిందేంటంటే?

గత రెండు రోజుల నుంచి ఓ మహిళ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్పందించి వెంటనే దగ్గరలోని ఓ క్లినిక్ తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఆ ఆస్పత్రి నర్సులు ఆ మహిళను ఓ బెడ్ పై పడుకోబెట్టారు. ఇదే విషయాన్ని క్లినిక్ లోని డాక్టర్ కు వివరించారు. ఆమెను పరీక్షించిన ఆ వైద్యుడు ఆమెకు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. కట్ చేస్తే.. అదే ఆస్పత్రిలో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మధ్య ప్రదేశ్ కు చెందిన హీరాలాల్-కుసుమ్ (55) దంపతులు. వీళ్లు బతుకు దెరువు కోసం చాలా రోజుల కిందటే హైదరాబాద్ కు వలస వచ్చి నగరంలోని చందానగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తలు ఇక్కడే కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే, కుసుమ్ గత రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్పందించి వెంటనే చందానగర్ లో ఉన్న ఓ క్లినిక్ కు తీసుకెళ్లారు. అప్రమత్తమైన ఆ డాక్టర్ పరిశీలించి వెంటనే ఆమెకు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు.

ఇక వెంటనే ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి కుసుమ్ ను పరిశీలించి చూడగా అప్పటికే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నగరంలో ఉన్న వారి బంధువులు అంతా ఏకమై ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతురాలి భర్త.. ఆ డాక్టర్ నిర్లక్ష్యంతోనే నా భార్య ప్రాణాలు కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం వికటించిన కారణంగానే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయిందని వైద్య అధికారులు సైతం తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: వీడియో: భర్త ఎంత ఇంటికి రాకపోతే మాత్రం ఇలా చేస్తారా?