iDreamPost
android-app
ios-app

తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు సంచలన నిర్ణయం! గత నాలుగు రోజులుగా..!

తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు సంచలన నిర్ణయం! గత నాలుగు రోజులుగా..!

సాయంత్రం వేళ నడి రోడ్డుపై రయ్ రయ్ మంటూ బైక్ పై వెళ్తే ఎలా ఉంటుంది, ఆ కిక్కే వేరు. ఇదంతా ఇప్పటి ట్రెండ్. తోటి స్నేహితులు అంతా మంచి మంచి బైక్ పై దూసుకెళ్తుంటే మనం కూడా ఓ బైక్ కొనుక్కుని నడపాలనే కోరిక ఉంటుంది. అయితే అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ కుర్రాడు.. నాకు కూడా ఓ బైక్ కావాలంటూ తన తండ్రిని అడిగాడు. పేద కుటుంబం కావడంతో తండ్రి నిరాకరించాడు. దీంతో కుమారుడు తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నట్టుండి కొడుకు ఇంత పని చేస్తాడని ఆ తల్లిదండ్రులు అస్సలు ఊహించలేదు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని గౌరి శంకర్ కాలనీలో వెంకటయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గోవర్దన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇతని స్నేహితులు అంతా బైక్ పై తిరుగుతుండడంతో నేను కూడా బైక్ నడపాలని అనుకున్నాడు. గోవర్దన్ ఇదే విషయాన్ని గత నెల 31న తండ్రికి వివరించాడు. మనకు బైక్ కొనే స్థోమత లేదని వెంకటయ్య కొడుకుకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు. తండ్రి అలా చెప్పడంతో గోవర్దన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో ఆ యువకుడు ఆ రోజు రాత్రి ఇంటికి రాలేదు. ఖంగారు పడ్డ అతని తల్లిదండ్రులు చుట్టు పక్కల కాలనీల్లో అంతటా వెతికారు. అలా నాలుగు రోజులు గడిచింది. ఆ యువకుడి జాడ మాత్రం తెలియరాలేదు. దీంతో చేసేదేం లేక తండ్రి వెంకటయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి గోవర్దన్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: యువతి టార్చర్ తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం!