iDreamPost
android-app
ios-app

యువతి టార్చర్ తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం!

  • Published Aug 05, 2023 | 8:19 PM Updated Updated Aug 05, 2023 | 9:45 PM
  • Published Aug 05, 2023 | 8:19 PMUpdated Aug 05, 2023 | 9:45 PM
యువతి టార్చర్ తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం!

యువకుడి వేధింపులను తట్టుకోలేక యువతి ఆత్మహత్య.. ఇలాంటి ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, తాజాగా మాత్రం ఓ యువతి వేధింపులను భరించలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఇప్పుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ యువతి అన్నదమ్ములను ఎందుకు టర్చర్ పెట్టింది? దీని వెనకాల అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేటలో మనోహర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఫేస్ బుక్ ద్వారా ప్రియాంక అనే యువతి పరిచయం అయింది. కొంత కాలం పాటు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. కట్ చేస్తే.. మనోహర్ గత ఏడాది నుంచి ప్రియాంకతో మాట్లాడకుండా దూరం పెట్టాడు. దీంతో ఆ యువతి తట్టుకోలేక అతడిని ప్రశ్నించింది. ఇదే విషయంపై ఇద్దరు అనేక సార్లు గొడవ పడ్డారు. ఇక గతంలో పెద్దలతో పంచాయితి కూడా పెట్టించారు. ఈ క్రమంలోనే ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతనికి ఏం చేయాలో తెలియక రూ.70 వేలు ఇస్తానని ప్రియాంకకు వివరించాడు. కానీ, ఆమె ఒప్పుకోకపోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అతడ్ని అరెస్ట్ చేయడంతో దాదాపు 80 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినా ప్రియాంక వదలకుండా మళ్లీ మనోహర్ ను టార్చర్ పెడుతూ ఉండేది. ఆ యువతి రాను రాను మనోహర్ అన్నను కూడా వేధించడం మొదలు పెట్టింది. దీంతో ఆగని ఆ యువతి.. మనోహర్, అతని అన్న నరేష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అద్దరి అన్నదమ్ములను అటు ప్రియాంకే కాకుండా ఇటు పోలీసులు కూడా వేధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటన్నిటిని భరించలేని మనోహర్, నరేష్ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet