iDreamPost

HYD: అర్థరాత్రి స్పా సెంటర్ పై పోలీసుల దాడులు.. బట్టబయలైన గలీజ్ దందా!

HYD: అర్థరాత్రి స్పా సెంటర్ పై పోలీసుల దాడులు.. బట్టబయలైన గలీజ్ దందా!

హైదరాబాద్ లో మరో గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్థరాత్రి పోలీసులు కొన్ని స్పా సెంటర్ లపై దాడులు చేయగా ఈ వ్యవహారం బట్టబయలైంది. అనంతరం పోలీసులు ఈ ఘటపపై కేసు నమోదు చేసుకుని స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే? కొందరు నిర్వాహకులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పా, వెల్వెట్ స్పా సెంటర్లను నిర్వహిస్తున్నారు. అయితే పైకి బోర్డు మాత్రం స్పా సెంటర్ అని కనిపిస్తున్నా.. లోపల మాత్రం గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

కాగా, ఇదే విషయం తాజాగా పోలీసులకు తెలియడంతో సోమవారం అర్థరాత్రి ఆ సెంటర్ లపై దాడులు చేశారు. ఈ రైడ్ లో దాదాపు 17 మంది యువతులను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో పాటు ఇద్దరు నిర్వాహకులు, మేనేజర్లతో పాటు ఇద్దరు విటులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్పా సెంటర్ పేరుతో లోపల వ్యభిచారం నిర్వహించిన ఈ గలీజ్ దందాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వివాహేతర సంబంధం! రక్తపు మడుగులో మహిళ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి