iDreamPost
android-app
ios-app

వివాహేతర సంబంధం! రక్తపు మడుగులో మహిళ..

వివాహేతర సంబంధం! రక్తపు మడుగులో మహిళ..

ఏలూరు జిల్లా కేంద్రంలోని దక్షిణపు వీధిలో ఆదివారం సాయంత్రం మహిళ హత్యకు గురైంది.  ఆమెను హత్య చేసిన నిందితుడు నూజివీడు సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్మ చేసుకున్నాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదివారం సాయంత్రం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఏలూరు దక్షిణపు వీధిలో ఉడత సుజాత అనే మహిళ కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్యగావింప బడింది. మహిళ  హత్య జరిగిన ఇంటి వ్యక్తి సత్యనారాయణ నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య  చేసుకున్నాడు. అయితే తొలుత సుజాత హత్య బయటకు రాలేదు. సత్యనారాయణ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా.. అతడి ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. ఆ ఇంటి తలుపు తీసే సరికి..సుజాత రక్తపు మడులు విగతజీవిగా పడి ఉంది. దీనిపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య సత్యనారాయణ చేశారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో  పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మృతురాలి బంధువు మాట్లాడుతూ….”ఆదివారం మధ్యాహ్నం షాపులో నుంచి ఇంటికని చెప్పి వెళ్లింది. ఎవరు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు.. షాపుకు తిరిగి రాలేదు. సాయంత్రం ఇంటికి రాకపోయే సరికి రాత్రంత వెతికాము. సత్యనారాయణ మీద అనుమానం ఉండి.. వెతికాము.. అతడు కూడా కనిపించలేదు. అతడికి ఫోన్ చేస్తే… సుజాత గురించి నాకు తెలియదమ్మ.. ఆమెకు నాకు గొడవైందని చెప్పాడు” అని మృతురాలి బంధువులు తెలిపింది. వాళ్లిద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారని, ఆ అనుమానంతోనే సత్యనారాయణకు ఫోన్ చేశామని వారు తెలిపారు. అతడి ఆత్మహత్యతో సుజాత హత్య బయట పడటంతో స్థానికులు అందరూ షాకి గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చనిపోయిందని అందరినీ నమ్మించారు.. పాపం, ఇది నిజమే అనుకుని..!

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet