వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. స్నేహం కోసం భర్తకు ద్రోహం చేసిన ఇల్లాలు

రాజేశ్వరి, రేణుక మంచి స్నేహితులు.. కష్ట నష్టాల్లో స్నేహితురాలు రేణుకకు తోడుగా నిలుస్తుంది రాజేశ్వరి. రేణుకకు కొడుకును పోలీస్ చేయాలన్నది కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తుంది. ఈ విషయం తెలిసిన రాజేశ్వరి

రాజేశ్వరి, రేణుక మంచి స్నేహితులు.. కష్ట నష్టాల్లో స్నేహితురాలు రేణుకకు తోడుగా నిలుస్తుంది రాజేశ్వరి. రేణుకకు కొడుకును పోలీస్ చేయాలన్నది కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తుంది. ఈ విషయం తెలిసిన రాజేశ్వరి

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు మహిళల పేర్లు రాజేశ్వరి, రేణుక. ఇద్దరు మంచి స్నేహితులు. రాజేశ్వరితో ప్రతి విషయాన్ని పంచుకునేది రేణుకా. బాధను, సంతోషాన్ని పంచుకునేది. అయితే రేణుకా తన కొడుకును పోలీసును చేయాలన్నది కోరిక. అప్పటికే కొడుకు కానిస్టేబుల్ పరీక్ష రాశాడు. ఈ కలను సాకారం చేసేందుకు కృషి చేసేందుకు తల్లి ప్రయత్నిస్తుండగా.. అందుకు స్నేహితురాలు రాజేశ్వరి కూడా సహకరిస్తోంది. ఈ నెల 24న ఆటోలో రాయచూర్ తాలూకాలోని మన్సాలాపూర్ గ్రామ శివారులోని హోవిన తోటలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు. ఇంకాసేపట్లో గుడిలోకి ప్రవేశిస్తుండగా.. ఇద్దరు కేకలు వేయడం మొదలు పెట్టారు. ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు.. వారిని బెదిరించి బంగారం ఎత్తుకు వెళ్లిపోయారు.

తీరా పోలీసులు రంగంలోకి దిగితే.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. స్నేహం కోసం భర్తకు ద్రోహం చేసేందుకు సిద్దమైందో ఇల్లాలు. ఈ ఇద్దరు మహిళలే.. ఈ దొంగతనానికి స్కెచ్ వేశారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూర్ తాలుకా మంసాలాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాజేశ్వరి, రేణుక ఇద్దరు స్నేహితులు. రాయచూరు నగరంలో నివసిస్తున్నారు. రాజేశ్వరి భర్త దగ్గర రేణుక 10 లక్షలు అప్పు తీసుకుంది. రెండు రూపాయలు చొప్పున వడ్డీకి తీసుకోగా.. ప్రతి నెలా రూ. 20 వేలు వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. కొన్ని నెలల పాటు ఠంచనుగా కట్టేసింది రేణుక. అయితే కొన్ని నెలల నుండి కట్టలేకపోయింది. స్నేహితురాలి భర్త పదే పదే డబ్బులు అడగటంతో ఇల్లు అమ్మి అప్పు తీరుస్తానని చెప్పింది.

స్నేహితురాలు అప్పుల పాలు కావడంతో పాటు కొడుకును పోలీస్ చేసేందుకు కష్టపడటం చూసిన రాజేశ్వరి.. రేణుకకు ఇల్లు అమ్మోద్దు అని సలహా ఇచ్చింది. దీని కోసం ఇద్దరు కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. గుడికి వెళ్లే సమయంలో ఈ పథకాన్ని రచించారు. ఇద్దరు ముసుగు వ్యక్తులు వచ్చి.. రాజేశ్వరి నగలతో పాటు రేణుక ఒంటిపై బంగారాన్ని కూడా దోచుకెళ్లినట్లు కథ అల్లారు. తన కంకణం, బంగారు గొలుసు, బ్రాస్లెట్ అంటే సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారని, అలాగే రేణుకకు సంబందించిన కొంత బంగారాన్ని ఇద్దరు ముసుగులేసుకున్న దొంగలు దోచుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రాయచూరు రూరల్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజేశ్వరి తన కొడుకును పిలిచి.. ఆ బంగారాన్ని ఇచ్చి ఆ డ్రామా ప్లే చేసింది. వాటిని అమ్మి రేణుకాకు ఇద్దామనుకుంది. కానీ వారి ప్లాన్స్ పారనివ్వలేదు పోలీసులు.

Show comments