iDreamPost
android-app
ios-app

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులపైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులపైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు!

ఏపీలోని చిలకలూరిపేటలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం బస్సు కోసం బస్టాండ్ వద్ద నిలుచున్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతే కాకుండా ఈ ప్రమాదంలో షేక్ మసీదా అనే విద్యార్థిని అక్కడికక్కడే మరణించగా మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, గాయపడ్డ యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే షేక్ మసీదా మరణవార్త తెలియడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabet