iDreamPost

గణేష్‌ నిమజ్జనంలో అపశృతి.. భక్తులపై దాడి చేసిన చేప!

గణేష్‌ నిమజ్జనంలో అపశృతి.. భక్తులపై దాడి చేసిన చేప!

వినాయక చవితి నాడు దేశ వ్యాప్తంగా కొలువు దీరిన గణేశులు మెల్లమెల్లగా గంగమ్మ చెంతకు చేరుతున్నారు. దేశ వ్యాప్తంగా గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అపశృతులు సైతం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తిరుపతిలో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేస్తుండగా.. ఓ భారీ చేప భక్తులపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపర్చింది. ఈ దాడిలో 14 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాలోని చిట్టమూరులో తాజాగా గణేష్‌ విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరిగింది. గణేష్‌ ఉత్సవ కమిటి విగ్రహంతో సముద్ర తీరానికి చేరింది. భక్తులు కొంతమంది విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయటానికి సముద్రంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఓ భారీ చేప వారిపై దాడికి దిగింది. విచక్షణా రహితంగా తన తోకతో వారిని కొడుతూ గాయపర్చింది. ఈ చేప దాడిలో మొత్తం 14 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం చేప అక్కడినుంచి సముద్రం లోపలికి వెళ్లిపోయింది.

ఇక, గాయపడిన భక్తులను అక్కడి వారు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సముద్ర తీర ప్రాంతంలో చేప దాడి జరగడం.. ఏకంగా 14 మంది తీవ్రంగా గాయపడ్డం కలకలం రేపుతోంది. దీంతో మిగిలిన భక్తులు కూడా నిమజ్జనం కోసం ఆ ప్రాంతానికి వెళ్లటానికి భయపడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి