iDreamPost
android-app
ios-app

లోన్ యాప్ నిర్వాహకుల బరితెగింపు.. యువతికి అండగా నిలిచిన దిశ పోలీసులు

లోన్ యాప్ నిర్వాహకుల బరితెగింపు.. యువతికి అండగా నిలిచిన దిశ పోలీసులు

గత కొన్ని రోజుల నుంచి లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించినా కూడా మరిన్ని డబ్బులు చెల్లించాల్సి ఉందని వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక బాధితులు చెల్లించనంటూ గట్టిగా ప్రశ్నిస్తే వారి ఫోన్ లు హాక్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బాధిత యువతికి అండగా నిలిచారు దిశ పోలీసులు. ఫిర్యాదు చేసిన ఆరు నిమిషాల్లోనే యువతి వద్దకు వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి మేమున్నామంటూ భరోసా కల్పించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం మండలం కేంద్రంలో నివాసం ఉండే యువతి వారం రోజుల కిందట అత్యవసర నిమిత్తం రూ. 3 వేల కోసం రెండు యాప్ ల ద్వారా ఆ యువతి 3,700 రూపాయలు తీసుకుంది. తీసుకున్న డబ్బులను మూడు రోజుల తరువాత తిరిగి చెల్లించింది. అయినప్పటికీ ఇంకా డబ్బులు కట్టాలని లోన్ యాప్ నిర్వాహకుల నుండి యువతికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగదు కట్టకపోతే ఫోటో లను మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని యువతిని భయందోళనలకు గురి చేశారు.

ఇక శుక్రవారం రోజున యువతి ఫోన్ ను యాప్ నిర్వహకులు హాక్ చేసి, మార్ఫింగ్ చేసిన యువతి ఫోటోలను ఆమె కాంటాక్ట్ నెంబర్లకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి షాక్ గురైంది. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత యువతి వెంటనే దిశ SOS కు కాల్ చేసి జరిగింది మొత్తం వివరించింది. సమాచారం అందిన ఆరు నిమిషాల్లోనే దిశ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు ధైర్యం చెప్పి మేమున్నామంటూ భరోసా కల్పించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 12 ఏళ్ల బాలికపై దారుణం! మృగాలుగా మారిన దేవాలయ ట్రస్ట్‌ ఉద్యోగులు