Uppula Naresh
Uppula Naresh
గత కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీలో వరుస హత్య ఘటనలు అక్కడి వారిని భయందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికీ ఢిల్లీలో ఎన్నో హత్య ఘటనలు వెలుగు చూశాయి. ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పార్క్ లో ఓ విద్యార్థినిని రాడ్డుతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే ఘటన ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఓప్రాంతంలో నర్గీస్ (25) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే, ఈ యువతి ఇర్ఫాన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి ప్రేమాయణం చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల ఆ యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు అతడితో పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీని కారణంగా ఆ యువతి ప్రియుడితో మాట్లాడడం మానేసింది. ప్రియురాలు పట్టించుకోకపోవడంతో ఇర్ఫాన్ తట్టుకోలేకపోయాడు. ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. ఇకపోతే.. తాజాగా ఇద్దరు కలిసి మాలవీయానగర్ లో ఉన్న ఓ పార్కుకు వెళ్లారు. పెళ్లి విషయమై మరోసారి చర్చించుకున్నారు.
ఆ యువతి అతడితో పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన ఇర్ఫాన్.. అక్కడున్న ఓ ఇనుప రాడ్డుతో ప్రియురాలి నర్గీస్ ను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు పరారీలో ఉన్న నిందితుడు ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Delhi | We received information that the body of a 25-year-old girl was found near Aurbindo College in South Delhi’s Malviya Nagar. An iron rod was found near her body. According to a preliminary investigation, the girl was attacked with a rod. Further investigation is in… pic.twitter.com/eCOeVAd1yi
— ANI (@ANI) July 28, 2023
ఇది కూడా చదవండి: చెల్లి తల పగలకొట్టి చంపిన అన్న.. ఇప్పుడు వైరలవుతోన్న వీడియో!