iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో మరో దారుణం.. ఓ యువతిని కిరాతకంగా హత్య చేసి..!

దేశ రాజదాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచారు. మహిళ మృతదేహం కనిపిచండంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

దేశ రాజదాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచారు. మహిళ మృతదేహం కనిపిచండంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఢిల్లీలో మరో దారుణం.. ఓ యువతిని కిరాతకంగా హత్య చేసి..!

దేశ రాజదాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచారు. మహిళ మృతదేహం కనిపిచండంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచనంగా మారుతోంది. ఇంతకు క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. స్విట్జర్లాండ్ కు చెందిన లీనా బెర్గర్ (30) అనే మహిళ ఇటీవల ఇండియాకు వచ్చింది. అయితే ఢిల్లీకి చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తితో ఆమె ప్రేమ వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తుంది. గురుప్రీత్ సింగ్ కూడా అప్పుడప్పడు స్విట్జర్లాండ్ కు వెళ్లొచ్చేవాడని తెలుస్తుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. లీనా బెర్గర్ కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని కారులోని ఓ ప్లాస్టిక్ కవర్ లో మూటగట్టి వదిలేసి వెళ్లారు. ఈ సీన్ చూసిన స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు.

ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాను పరిశీలించగా.. అందులో గుర్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే అతడి వద్ద రూ. 2.25 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం.. లీనా బెర్గర్ గత కొంత కాలం నుంచి మరొకరితో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానించాడు. దీని కారణంగానే ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి