Nidhan
సెక్యూరిటీ గార్డుగా పని చేయడం అంత ఈజీ కాదు. దొంగలు, నేరస్థుల బారి నుంచి అందర్నీ కాపాడుతూ విధులు నిర్వహించడం చాలా కష్టమైన పని.
సెక్యూరిటీ గార్డుగా పని చేయడం అంత ఈజీ కాదు. దొంగలు, నేరస్థుల బారి నుంచి అందర్నీ కాపాడుతూ విధులు నిర్వహించడం చాలా కష్టమైన పని.
Nidhan
సమాజంలో కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఆ జాబ్స్ చేసేవారినే అందరూ మెచ్చుకుంటారు. వాళ్లు అందరికంటే తోపు అని పొగుడుతుంటారు. అయితే సొసైటీ ముందుకు వెళ్లాంటే ప్రజలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం చేయాల్సిందే. ఫలానా జాబ్ గొప్ప, ఫలానాది తక్కువ అని ఉండదు. అలా సమాజంలో పెద్దగా గుర్తింపు లేని ఉద్యోగాల్లో సెక్యూరిటీ గార్డు ఒకటి. చాలా మంది ఈ జాబ్ చాలా సింపుల్ అనుకుంటారు. వస్తూ, పోయే వాళ్లను గమనిస్తే చాలని అనుకుంటారు. కుర్చీలో కూర్చోవడం, ఎవరైనా వస్తే సెల్యూట్ కొట్టడమే వాళ్ల పని అని తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు. కానీ ఆపద వస్తే రక్షించడం, శత్రువులకు ఎదురెళ్లడం.. సంస్థకు, అందులోని ఉద్యోగులు, కస్టమర్లకు సేఫ్టీ కల్పించడం వారి బాధ్యత అని చాలా మందికి తెలియదు. సెక్యూరిటీ గార్డు ఎలా ఉండాలో ఓ సర్దార్జీ చూపించాడు.
గన్స్‌తో ఏటీఎంలోకి చొరబడ్డ దొంగల్ని తరిమికొట్టాడు ఓ సెక్యూరిటీ గార్డు. ఐదారుగురు దొంగలు చేతిలో అత్యాధునిక రివాల్వర్లతో నిలబడి ఉన్నా భయపడలేదు. తన దగ్గర ఉన్న తుపాకీతో వారిని గజగజలాడించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ కొందరు వ్యక్తులు గన్స్‌తో ఓ ఏటీఎంలో ఉన్నారు. వాళ్లతో ప్రమాదం అని గ్రహించిన ఓ సెక్యూరిటీ గార్డు ఏటీఎంలోనే అందర్నీ బంధించి షెటర్ వేశాడు. అయితే దొంగలు మాత్రం ఆ డోర్‌ను బ్రేక్ చేసి సర్దార్జీని కాలుద్దామని షెటర్ తీశారు. కానీ సెక్యూరిటీ గార్డు తన బలమంతా ఉపయోగించి షెటర్ పైకి రాకుండా ప్రయత్నించాడు. అయితే దొంగలు ఎక్కువ మంది అటు వైపు నుంచి షెటర్‌ను లాగడంతో అతడి వల్ల కాలేదు. షెటర్ పైకి వచ్చేయడంతో దొంగలు అతడిపై ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించారు.
షెటర్ పైకి లేవడంతో వెంటనే మెట్ల దగ్గరకు వచ్చిన సెక్యూరిటీ గార్డు.. దొంగలు తనను షూట్ చేస్తారని గ్రహించాడు. వాళ్లు తన వైపు గురిపెట్టేలోపు ఆ దొంగల వైపు తన గన్ తీసి ఎక్కుపెట్టి కాల్చాడు సర్దార్జీ. దీంతో వారిలోని ఒకరి పైకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ గాయంతో ఒక దొంగ శరీరం నుంచి నెత్తురు బయటకొచ్చింది. దీంతో దొంగలు ఆ షెటర్‌ను క్లోజ్ చేశారు. గన్ ఫైర్ చేసిన సర్దార్జీ వెంటనే మెట్లు దిగి కిందకు వెళ్లి మెయిన్ డోర్ మూసేశాడు. దొంగల్ని లోపలే బంధించాడు. ఇది పాత వీడియోనే అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఘటన ఎక్కడ జరిగింది? అనేది క్లారిటీ లేదు. అది ఏటీఎం అని కొందరు అంటుంటే.. మరికొందరు బ్యాంక్ అని అంటున్నారు. ఏదేమైనా ప్రాణాలకు ఒడ్డి మరీ దొంగలకు ఎదురుగా నిలవడం గ్రేట్ అంటూ సర్దార్జీని నెటిజన్స్ పొడుగుతున్నారు. ఆ సెక్యూరిటీ గార్డుకు సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. తుపాకులతో భయపెట్టిన దొంగలకు సెక్యూరిటీ గార్డు ఓ రేంజ్లో పోయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: కానిస్టేబుల్ దారుణం: భర్తను జైలులో బంధించి.. భార్యను లైంగికంగా..
Sardar Ji having Deadly Kalesh with Robbers (Robber’s trying to force entry gets 12 gauge surprise!)
https://t.co/wkJ38G79sN— Ghar Ke Kalesh (@gharkekalesh) February 13, 2024