కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య! అంత కష్టం ఏమి వచ్చింది అంటే!

భార్యకు బిడ్డల తర్వాతే భర్త అయినా, తన తల్లిదండ్రులైనా. ఓ ప్రాణి తన కడుపులో ఊపిరి పోసుకున్న నాటి నుండి.. కని, పెంచి, పెద్ద చేసేంత వరకు ఎన్నో బాధ్యతలు చేపడుతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు తల్లి. కానీ

భార్యకు బిడ్డల తర్వాతే భర్త అయినా, తన తల్లిదండ్రులైనా. ఓ ప్రాణి తన కడుపులో ఊపిరి పోసుకున్న నాటి నుండి.. కని, పెంచి, పెద్ద చేసేంత వరకు ఎన్నో బాధ్యతలు చేపడుతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు తల్లి. కానీ

‘మన లైఫ్‌లో మనకు ముఖ్యమైన వాళ్లు మనల్ని వదిలి వెళ్లిపోతే.. మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకు నచ్చినట్లు మారుతుంది’ ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఇది తెలియక చాలా మంది తనువు చాలిస్తున్నారు. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయిందని, అన్నింటికి తనపై ఆధారపడిపోయిన జీవిత భాగస్వామిని పొగొట్టుకున్నానమన్న ఆవేదనలో మానసికంగా కృంగిపోయి తప్పుడుగులు వేస్తూ.. నిండైన జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకుంటున్నారు. ఇతర కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిలుస్తున్నారు. తన ప్రాణాలను తీసుకోవడమే కాదు.. ఎంతో భవిష్యత్తు చూడాల్సిన చిన్నారుల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారు కొందరు. ఈ తల్లి అలానే చేసింది.

భర్త లేకపోతే జీవితమే లేదనుకున్న ఈ వివాహిత.. తాను చనిపోతూ.. తన కొడుకును కూడా చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరులోని యలహంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వీరి ప్రోపర్ .. తిరుపతి జిల్లా అని తెలుస్తుంది.  యలహంకలోని ఆర్‌ఎంజెడ్‌ అపార్టుమెంట్‌లో పులివర్తి శ్రీధర్‌ (47), రమ్య (40), వారి కుమార్తె (20), కుమారుడు భార్గవ్‌ (13) నివాసం ఉంటున్నారు. శ్రీధర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. మూడు నెలల క్రితం శ్రీధర్ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. భర్త ఇక లేడు అన్న వార్తను తట్టుకోలేక పోయింది రమ్య. అప్పటి నుండి ముభావంగా ఉండేది. కాగా,  కుమార్తె.. పీజీ హాస్టల్లో ఉంటూ బీఎస్సీ చదువుతుండగా..  కుమారుడు భార్గవ్ ఏడో తరగతి చదువుతున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక పోయిన భార్య.. తరచూ ఇదే విషయాన్ని కూతురితో చెబుతూ బాధపడేది. దీంతో ఆమెను ఓదార్చేది కూతురు.

అయినప్పటికీ రమ్య వేదన తీరలేదు. గురువారం ఫోన్ చేసి.. మీనాన్న లేని జీవితం నాకొద్దూ చనిపోతా అంటూ కూతురికి చెప్పింది. అయితే సర్థి చెప్పింది కూతురు. అంతలో ఆమె మానసికంగా కుంగిపోయి కొడుకు భార్గవ్ కు తొలుత ఉరేసి హత్య చేసింది. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది.  శుక్రవారం తల్లికి ఫోన్ చేయగా.. ఎంతకు తీయకపోవడంతో హుటా హుటిన తన ఇంటికి చేరుకుంది  కూతురు. ఇంటికి వెళ్లి  చూడగా.. తల్లితో పాటు తమ్ముడు ఉరి వేసుకుని కనిపించారు. భర్త లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నానని పోలీసులకు, డాక్టర్, కుమార్తెకు లేఖ రాసింది.  సమాచాారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పిల్లల్ని కనడం, వారి బరువు బాధ్యతలను నేరవేర్చడం వరకు తల్లిదండ్రులకు హక్కు ఉంది. వారిని చంపే హక్కు లేదని కొందరి వాదన.

Show comments