9 మందిని చంపిన సైకోని.. స్కెచ్ ఆర్టిస్ట్ పట్టించాడు! సూపర్ మూవీని మించిన కథ ఇది!

సినిమాల ప్రభావం జనాల మీద పడుతుందో లేక రియల్ ఇన్సిడెంట్స్ సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయో తెలియదు కానీ.. ఈ క్రైమ్ స్టోరీ చూస్తే మాత్రం.. సినిమాకు ఏమాత్రం తీసిపోదు అనుకుంటారు..?

సినిమాల ప్రభావం జనాల మీద పడుతుందో లేక రియల్ ఇన్సిడెంట్స్ సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయో తెలియదు కానీ.. ఈ క్రైమ్ స్టోరీ చూస్తే మాత్రం.. సినిమాకు ఏమాత్రం తీసిపోదు అనుకుంటారు..?

సినిమాను మించిపోయిన క్రైమ్ స్టోరీ ఇది . ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని పొట్టనపెట్టుకున్నాడు ఈ సీరియల్ కిల్లర్. 45 నుండి 65 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలే అతడి టార్గెట్. నిర్మానుష్య ప్రాంతంలో కనిపించిన మహిళల్ని చంపేయడం ఓ వ్యవసనంలా మారింది. చీర లేదా దుప్పట్టాతో గొంతు నులిమి చంపేశాడు. 13 నెలల్లో 9 మంది మహిళలు హత్య చేసి.. వారి దగ్గర నుండి ఏదో వస్తువు తీసుకుని వెళ్లిపోతుంటాడు. హత్యలు చేసి పోలీసులకు సవాలు విసిరిన సైకో. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడ్ని పట్టుకునేందుకు ఓ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. స్కెచ్‌లు గీయించి, సోదాలు చేపట్టి.. ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకున్నారు. సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఈ రియట్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

సీరియల్ కిల్లర్ కుల్దీప్ కుమార్ గంగ్వార్‌ను ఎట్టకేలకు దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కుల్దీప్ జులై 2023 నుండి జులై 2024 మధ్య బరేలీని షాహి, షీప్‌గఢ్‌లోని నిర్జన ప్రదేశాల్లో సంచరిస్తున్న ఒంటరి మహిళల్ని హత్య చేశాడు. వారి వద్దకు వెళ్లడం, లైంగికంగా వశపరుచుకోవడానికి ప్రయత్నించడం, ప్రతిఘటిస్తే.. చీరతో లేదా చున్నీతో గొంతు నులిమి చంపేయడం అలవాటుగా మారింది. అలా మొత్తం 9 మందిని చంపి పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో సవాలుగా స్వీకరించిన పోలీసులు ఆపరేషన్ తలాష్ స్టార్ట్ చేశాడు. 22 బృందాలను ఏర్పాటు చేశారు. 1,50 ,000 అనుమానాస్పద మొబైల్ నంబర్స్ స్కాన్ చేశారు. 1500 సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. ఇక షాహి, షీప్‌గఢ్‌ గ్రామాల్లో 25 కిలో మీటర్ల పరిధిలో నిరంత గస్తీ కాశారు.

హత్యలు జరిగిన ప్రాంతాల్లో పలువురితో మాట్లాడిన పోలీసులు నిందితుడి స్కెచెస్ వేయించారు. అలా మూడు స్కెచ్‌లు ఒకేలా ఉండటంతో.. నిందితుడు అతనేనని నిర్ధారించుకుని.. ఆపరేషన్ తలాష్ ముమ్మురం చేశారు. అతడి స్కెచ్‌లను స్థానిక పోలీస్ స్టేషన్లకు పంపించారు. గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు గురువారం నిందితుడ్ని పట్టుకున్నారు. కాగా, ఇందులో ఆరు నేరాలను ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కుల్దీప్ ఈ హత్యలు చేయడానికి కారణాలను వెల్లడించారు పోలీసులు.. బాల్యంలో జరిగిన పలు సంఘటనలు అతడ్ని నేరస్థుడిగా మార్చాయని చెబుతున్నారు. తల్లి ఉండగానే.. తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకోవడం, సవితి తల్లీ అస్తమాను అతడ్ని కొట్టడం.. అతడి మనస్సుపై ప్రభావితం చేశాయి. అలాగే రెండో భార్య చెప్పగానే.. తన తల్లిని తండ్రి కొట్టడం చూశాడు. కుల్డీప్ ప్రవర్తన కారణంగా భార్య కూడా విడిచిపెట్టింది. దీంతో మహిళలంతా ఇలానే ఉంటారన్న కోపంతో అతడు మహిళల్ని టార్గెట్ చేస్తూ వరుస హత్యలకు పాల్పడ్డాడు.

Show comments