చిన్న కారణానికే కోడలి దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై కత్తులతో

కలకాలం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకుంటున్న భార్యా భర్తలు.. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు పొసగడం లేదు. ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం ఇద్దరిలోనూ ఉండటం లేదు.

కలకాలం కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకుంటున్న భార్యా భర్తలు.. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు పొసగడం లేదు. ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం ఇద్దరిలోనూ ఉండటం లేదు.

భార్యా భర్తల మధ్య నెలకొన్న గొడవలు.. ఊహించని దారుణాలకు కారణమౌతున్నాయి. దాంపత్యం జీవితంలో కలతలు వస్తే.. కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిన దంపతులు కోపంతో కాపురాన్ని కూల్చుకుంటున్నారు. ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు, వీరి విషయంలోకి మరొకరు జోక్యం చేసుకోవడం వెరసి తన్నుకోవడం వరకు వెళుతున్నాయి. దీంతో పగతో రగిలిపోతున్నారు భార్యా భర్తలు. పగ, ద్వేషాలను రగల్చుకుని.. వారి అంతు చూసేందుకు వెనకాడటం లేదు. వీరికి తోడు పిల్లలు, పెద్దలు కూడా బలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఇదే జరిగింది. భార్య, భర్తల మధ్య గొడవ ముగ్గురు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఇంతకు ఏం జరిగిందంటే..?

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలోని కోనంకిలో నరేష్.. తన అమ్మనాన్నలు ఆదిలక్ష్మి, సాంబ శివరావులతో కలిసి ఉంటున్నారు. నరేష్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి గతంలో వివాహం కాగా, విబేధాలకారణంగా మొదటి భార్యతో విడాకులు అయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం ముప్పాళ మండలం దమ్మాల పాడు గ్రామానికి చెందిన మాధురితో రెండో వివాహం జరిగింది. వీరికి ఓ పాప ఉంది. గత కొన్ని రోజుల నుండి నరేష్, మాధురిల మధ్య గొడవ జరుగుతుంది. బుధవారం ఉదయం కూడా భార్యా భర్తల మధ్య తగాదా జరగడంతో.. ఆ విషయాన్ని తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది. తన అత్తమామలు హింసిస్తున్నారని గతంలో కూడా పలుమార్లు చెప్పడంతో మాధురి కుటుంబ సభ్యులు కోపంతో ఉన్నారు.

మరోసారి కూడా తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని సోదరుడికి మాధురి చెప్పడంతో.. వెంటనే కొనంకి గ్రామానికి చేరుకుని.. అత్తమామలు, భర్తను నిలదీశారు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో.. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నరేష్, అతడి తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, సాంబశివరావులను దారుణంగా హత్య చేశారు. అనంతరం ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు మాధురి, ఇతర నిందితులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. భార్యా భర్తల మధ్య విభేదాలే ఈ ఘాతుకానికి కారణాలయ్యాయని పేర్కొన్నారు. భార్యా భర్తల మధ్య గిల్లికజ్జాలు ఉండాలి కానీ.. చంపేంత పగ ఉండకూడదు. దీని కన్నా దూరంగా ఉండటమే లేకుంటే పెద్దల సమక్షంలో విడిపోవడమో బెటర్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments