ఇంటి ముందు భర్త శవం.. భార్యకు చెబుదామని ఫోన్ చేస్తే ఆమె..

ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్ ముందు రోడ్డుపై రక్తపు మడుగుల్లో పడి కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులకు అతడి మెడలో ఏదో తాళం కనిపించింది. అలాగే భార్యకు సమాచారం ఇద్దామని కాల్ చేస్తే

ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్ ముందు రోడ్డుపై రక్తపు మడుగుల్లో పడి కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులకు అతడి మెడలో ఏదో తాళం కనిపించింది. అలాగే భార్యకు సమాచారం ఇద్దామని కాల్ చేస్తే

తను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ముందు రోడ్డుపై ఓ వ్యక్తి  అచేతన స్థితిలో కనిపించాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఖాకీలు వ్యక్తిని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మరణించినట్లు నిర్దారించడంతో.. ఈ విషయాన్ని ఆయన భార్యకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. ఎంతకు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే మృతుడి మెడలో ఇంటి తాళం చెవి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. తాళం తీసుకుని అతడి ఇంటికి వెళ్లారు. తొలుత తలుపు కొట్టారు.  కానీ తీయలేదు. దీంతో తాళం చెవితోె తలుపులు తీసి చూడగా విస్తుపోవడం  వారి వంతైంది. ఇంట్లో భార్య హత్యకు గురైంది.  దెబ్బకు పోలీసులకు దిమ్మ తిరిగినట్లయ్యింది.

ఈ ఘటన ముంబయిలోని ముంబైలోని గోరేగావ్‌లో చోటుచేసుకుంది. మృతులను కిషోర్ పెడ్నేకర్ ఆయన భార్య రాజశ్రీగా గుర్తించారు. జవహర్ నగర్‌లోని టోపీవాలా మాన్షన్ ముందు రహదారిపై 58 ఏళ్ల కిషోర్ పెడ్నేకర్ మృతదేహం పడి ఉంది.  పోలీసులు రావడం.. మెడలో దొరికిన కీతో తలుపులు తీయడం.. ఇంట్లో రాజశ్రీ శవం లభించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  కిషోర్ పెడ్నేకర్ జిమ్ ఎక్విప్మెంట్కు సంబంధించిన సేల్స్మెన్గా పని చేస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు రాజశ్రీ కూడా థెరపిస్ట్గా పనిచేస్తుండేది. వీళ్లకి ఓ కొడుకు ఉన్నాడు. అతడు ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఏం జరిగిందో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం తాను ఉంటున్న అదే అపార్ట్‌మెంట్ ముందు కిషోర్ రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ఇంట్లో భార్య హత్యకు గురైంది. ఈ కేసు విచారణలో భాగంగా అతడి ఫ్లాట్‌లో డిప్రెషన్ , డయాబెటిస్‌కు సంబంధించిన టాబ్లెట్స్ గుర్తించారు పోలీసులు. కొంత కాలంగా కిషోర్ డిప్రెషన్తో బాధపడుతున్నాడని ఇంట్లో మెడిసిన్స్ చూశాక అర్థమైంది. తొలుత భార్యను హత్య చేసి.. ఆ తర్వాత అతడు మేడపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు.  చనిపోయే ముందు ఢిల్లీ నుంచి ముంబైకి తన కొడుకుకు కిషోర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. బ్యాంక్ ఖాతాల వివరాలు తన సమీప బంధువులకు వాట్సప్ ద్వారా పంపిచాడు. ఆయనకు అప్పులేమైనా ఉన్నాయేమోననే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Show comments