హీరోయిన్‌ను తలపించే అందం భార్యది.. కానీ భర్త మాత్రం

ఇద్దరివీ భిన్న ధృవాలు. కానీ పెళ్లి ఈ ఇద్దరినీ కలిపింది. ఇద్దరు ఒకే చోట పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. హీరోయిన్‌ను తలపించే అందం భార్యది.. కానీ భర్త మాత్రం ఆమె చేసే కొన్ని పనులను తట్టుకోలేకపోయాడు. చివరకు

ఇద్దరివీ భిన్న ధృవాలు. కానీ పెళ్లి ఈ ఇద్దరినీ కలిపింది. ఇద్దరు ఒకే చోట పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. హీరోయిన్‌ను తలపించే అందం భార్యది.. కానీ భర్త మాత్రం ఆమె చేసే కొన్ని పనులను తట్టుకోలేకపోయాడు. చివరకు

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టేందుకు మాయదారిలా దాపురించింది ఫోను. దీని వల్ల గొడవలే కాదు హత్యలు, అఘాయిత్యాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియా అందుకు కారణం అవుతుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరు ఫేమ్ అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలనుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్.. అందులో కావాల్సినంత డేటా అందుబాటులో ఉండటంతో షాట్స్, రీల్స్ అంటూ వీడియోలు చేసి ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని తపన పడుతున్నారు. ముఖ్యంగా యువతులు, మహిళలు. ఈ కుతూహలమే ఓ మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది. భార్య రీల్స్ చేస్తూ నిత్యం ఫోనులో గడుపుతుందని భావించిన భర్త.. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి అసలు విషయం కక్కాడు.

హీరోయిన్‌ను తలపించే అందం భార్యది.. కానీ ఎంత చెప్పినా తన మాట పట్టించుకోకుండా రీల్స్ చేస్తుందన్న అక్కసుతో భార్యను కడతేడ్చాడు భర్త. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మావర్ తాలుకాలోని సాలిగ్రామం కర్కడ అంగన్ వాడీ కేంద్రం సమీపంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు కిరణ్ ఉపాధ్యాయ్.. జయశ్రీ. ఈ ఇద్దరు సమీపంలోని గురు నరసింహ ఆలయంలో వంట మనిషిగా పనిచేస్తున్నారు. అయితే జయశ్రీ మాత్రం సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ ఉండేది. అది కాస్త ఓవర్ అయ్యింది. రీల్స్ అంటూ నిత్యం మొబైల్‌లో బిజీగా ఉండేది. సోషల్ మీడియాలో పలు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేది. అయితే ఇది నచ్చని భర్త ఆమెను మందలించాడు. నయాన్నా, భయాన్నో చెప్పి చూశాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు సరికదా మరింత ఎక్కువవైంది.

ఈ విషయంలో దంపతుల మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. ఇక తట్టుకోలేకపోయాడు భర్త కిరణ్. తన మాట కాదంటుందని, తన పరువు బజారున వేస్తుందని భావించిన అతడు.. కత్తితో పొడిచి హత్య చేసి మేడపై నుండి తోసేశాడు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భర్త కిరణ్‌ను విచారించగా.. మేడపై నుండి పడిపోయిందని కాకమ్మ కబుర్లు చెప్పాడు. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి అసలు విషయం వెళ్లగక్కాడు. తనను, తన పిల్లల్ని పట్టించుకోకుండా సెల్ ఫోనులో మునిగి తేలుతున్న నేపథ్యంలోనే ఆమెను అంతం చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. పోలీసుల కేసు నమోదు చేసి.. నిందితుడు కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరింత విచారణ చేపడుతున్నారు.

Show comments