బంగారం లాంటి భార్య, కుందనపు బొమ్మల్లాంటి కూతుర్ని అలా చూడలేక

బంగారం లాంటి భార్య, కుందనపు బొమ్మల్లాంటి కూతుర్ని అలా చూడలేక

డబ్బు ఎవరికీ చేదు. ప్రపంచాన్ని నడిపించే డబ్బును ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నాడు మానవుడు. దీని చుట్టూనే బంధాలు తిరుగుతున్నాయి. అలాగే స్టేటస్ సింబల్ కూడా. దీంతో డబ్బు సంపాదించాలన్న ఆశతో సగటు మానవుడు..

డబ్బు ఎవరికీ చేదు. ప్రపంచాన్ని నడిపించే డబ్బును ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నాడు మానవుడు. దీని చుట్టూనే బంధాలు తిరుగుతున్నాయి. అలాగే స్టేటస్ సింబల్ కూడా. దీంతో డబ్బు సంపాదించాలన్న ఆశతో సగటు మానవుడు..

డబ్బు అంటే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ మనిషిని తప్పుడు మార్గంలోకి మళ్లేలా చేస్తుంది. తక్కువ సమయంలో కోటీశ్వరులు అయిపోవాలన్న ఉద్దేశంతో ఆన్ లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. ఈ గేమ్స్ వల్ల లైఫే అండ్ ఫ్యామిలీ రిస్క్‌లో పడుతుందని తెలిసినా కూడా వీటికి ఎడిక్ట్ అవుతున్నారు. ముందు మురిపించి.. ఆ తర్వాత దండుకోవడం స్టార్ట్ చేస్తాయి ఈ ఆన్ లైన్ గేమ్స్. అప్పటికే కాస్తంత డబ్బులు చూసిన మనిషి.. వాటిపై మరింత డబ్బులు వెచ్చించి వ్యసనంలా మలుచుకుంటాడు. చివరకు అంతా చేజారాక అప్పులు పాలై.. మొహం దాచుకోలేక, సమాధానం చెప్పలేక సతమతమౌతున్నాడు. ఇక దిక్కుతోచని స్థితిలో కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు ఒడిగడుతుంది. ఇదిగో శ్రీనివాస్ విషయంలో ఇదే జరిగింది.

ఆన్‌లైన్ గేమింగ్ రమ్మీకి అలవాటు పడి అప్పులపాలైన శ్రీనివాస్, బంగారం లాంటి భార్య, కుందనపు బొమ్మల్లాంటి కూతుర్నితో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. చన్నరాయపట్నంలోని కెరెబిడిలో నివాసం ఉంటున్నారు శ్రీనివాస్ (43), భార్య శ్వేత (36). వీరికి నాగశ్రీ (13) కూతురు ఉంది. శ్రీనివాస్ బెంగళూరులో కారు డ్రైవర్‌గా పని చేసి కుటుంబాన్ని పోషించాడు. శ్వేత ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా, కూతురు నాగశ్రీ 7వ తరగతి చదువుతోంది. అందంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో రమ్మీ గేమ్ దాపురించింది. డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన శ్రీనివాస్.. రమ్మీ గేమ్‌కు అలవాటు పడ్డాడు. ఇక కరోనా సంక్షోభంలో ఆదాయం తగ్గిపోవడంతో ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చేశాడు. పనికి వెళ్లకుండా ఆన్ లైన్ రమ్మీకి బానిసయ్యాడు.

దీని కోసం శ్రీనివాస్ అప్పులు చేశాడు. రుణం తిరిగి చెల్లించాలంటూ అప్పులోళ్లు అడుగుతుండటంతో సమాధానం చెప్పలేక సతమతమయ్యాడు. అటు పని చేయక.. ఇటు రమ్మీ గేమ్ లో డబ్బులు పోగొట్టుకోవడంతో కుటుంబాన్ని పోషించడం కూడా పెనుభారంగా తయారయ్యింది. ఇక భార్య, పాపకు కూడా తిండి పెట్టలేని పరిస్థితికి చేరాడు. అప్పులు కారణంగా తలెత్తుకోలేకపోయింది ఆ కుటుంబం. రోజు రోజుకూ అప్పులు ఇచ్చిన వాళ్లు.. ఇంటి మీదకు వచ్చి గొడవలు పడుతుంటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు శ్రీనివాస్. అయితే ఈ మంగళవారం ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఏమయ్యారో తెలియక అతడి తల్లిదండ్రులు చన్నరాయపట్నం నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం బాగూర్ హోబలిలోని ముద్లాపూర్ సమీపంలోని హేమావతి నాలాలో శ్రీనివాస్, శ్వేత మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు మృతదేహాలను బయటకు తీయగా, బాలిక నాగశ్రీ మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Show comments