Krishna Kowshik
ఈ ఆధునిక యుగంలో ఆడ, మగ అనే వ్యత్యాసాలు ఉండటం లేదు. ప్రతి రంగంలోనూ మగవాళ్లతో పోటీపడుతూ దూసుకెళుతున్నారు మగువలు. కానీ ఇంకా వీరి పట్ల వివక్ష ఉంటుంది. ఆడ పిల్ల పుట్టిందని అంతం చేస్తున్నారు కొంత మంది
ఈ ఆధునిక యుగంలో ఆడ, మగ అనే వ్యత్యాసాలు ఉండటం లేదు. ప్రతి రంగంలోనూ మగవాళ్లతో పోటీపడుతూ దూసుకెళుతున్నారు మగువలు. కానీ ఇంకా వీరి పట్ల వివక్ష ఉంటుంది. ఆడ పిల్ల పుట్టిందని అంతం చేస్తున్నారు కొంత మంది
Krishna Kowshik
ఒకప్పుడు అమ్మాయి పుడితే.. గుండెలపై కుంపటిలా ఫీల్ అయ్యేవారు తల్లిదండ్రులు. కానీ కాలం మారింది. సామాజిక కోణం ఛేంజ్ అయ్యింది. పరిస్థితులు మారాయి. దీంతో ఆడపిల్లల పట్ల వివక్ష తగ్గింది. ఎవరైనా తమకు ఓకే అంటున్నారు పేరెంట్స్. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలను తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అమ్మాయి ఊ అంటేనే పెళ్లి చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ తమపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయడం లేదు ఆడ పిల్లలు. వెల్ ఎడ్యుకేటెడ్స్‌గా మారి ప్రతి రంగంలోనూ మగవాళ్లతో పోటీపడుతూ దూసుకెళుతున్నారు. కానీ కొంత మంది అజ్ఞానం అనే చీకటిలో బతుకుతూ.. ఆడపిల్లను భారంగా ఫీల్ అవుతున్నారు. దత్తత లేదా అమ్మకానికి పెడుతున్నారు.
తాజాగా ఓ కసాయి తండ్రి సరిగా కళ్లు తెరవని పసిగుడ్డును అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ సేల్ కాకపోవడంతో చంపేశాడు. దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడలో చోటుచేసుకుంది. 35 రోజుల పసికందును కొట్టి చంపేశాడో కర్కోటకుడు. తనకు ప్రాణం పోసిన తండ్రే ఆ పాలిట యముడయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెక్కా భవాని, శివమణి భార్యాభర్తలు. వీరికి రెండో సంతానంలో ఆడ పిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టగానే నేను సాకలేనంటూ భార్యకు తెగేసి చెప్పాడు. బిడ్డను అమ్మేస్తానంటూ భార్యకు చెప్పగా.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. భార్య మాటలను పట్టించుకోకుండా ఆ ముక్కుపచ్చలారని ఆ పసిదాన్ని అమ్మకానికి పెట్టాడు. అయితే పసిపాపను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలాగే భార్య కూడా ససేమీరా అనడంతో కోపంతో ఊగిపోయాడు శివమణి. అరే తన మాటే కాదంటావా అంటూ భార్యపై చిర్రుబుర్రులాడాడు.
భార్య ఒడిలో పాలు తాగుతున్న పసిగుడ్డును తీసుకుని గోడ కేసి విసిరేశాడు. పీక నొక్కి చంపేశాడు. భోరున విలపించిన తల్లి భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 35 రోజుల పసిబిడ్డ హత్యకు గురైందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శివమణిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ పాపను పెంచి పోషించే స్థోమత లేక అమ్మకానికి పెట్టానని, దానికి భార్య అడ్డు చెప్పిందని నిందితుడు వెల్లడించాడు. దీంతో కోపంతోనే కూతుర్ని కడతేర్చినట్లు పేర్కొన్నారు. ఇదే కాదు గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యకే శివమణి పాల్పడ్డాడని తెలుస్తుంది. గతంలో కన్న కొడుకును కూడా అమ్మేసేందుకు ప్రయత్నించాడట నిందితుడు. అప్పుడు కూడా భార్య అడ్డుకున్నట్లు తెలుస్తుంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. డబ్బుల కోసం కూతుర్ని అమ్మకానికి పెట్టిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.