Krishna Kowshik
అతడికి అక్క కూతురితో ఇటీవల పెళ్లి అయ్యింది. అయితే భార్యను కాదని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 15 రోజుల క్రితం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని.. ఇద్దరు పిల్లల తల్లితో ఉంటున్నాడు
అతడికి అక్క కూతురితో ఇటీవల పెళ్లి అయ్యింది. అయితే భార్యను కాదని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 15 రోజుల క్రితం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని.. ఇద్దరు పిల్లల తల్లితో ఉంటున్నాడు
Krishna Kowshik
ఇటీవల కాలంలో వివాహేతర/ అక్రమ సంబంధాలు కామన్ అయిపోయాయి. ప్రతి ఇంటిలోనూ ఈ కుంపటి రాచుకుంటోంది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే.. భార్య ప్రియుడితో సరసాల్లో మునిగితేలిపోతుంది. అలాగే భార్యకు తెలియకుండా మరో మహిళతో వేరు కాపురం పెడుతున్నాడు భర్త. ఇద్దరినీ ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు. కోర్టులు కూడా మేజర్లైన ఇద్దరు ఒకరినొకరు కలిసి ఉండవచ్చునని చెబుతుంది. దీని వల్ల సంసారం బంధం బీటలు వారుతుంది. భార్యపై చిన్న విషయానికే కస్సుబుస్సలాడుతూ.. పరాయి స్త్రీ పంచన చేరుతున్నాడు మగాడు. చివరకు ఆమెతో అక్రమ సంబంధం నెరుపుతూ.. భార్యను, బిడ్డలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే వ్యవహారం ఇంట్లో కుంపటి రాజేయడంతో.. ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
నిత్యం పదిమందిలో ఉండే ఉద్యోగం.. ట్రాఫిక్ నియంత్రిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచే జాబ్‌లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. అక్రమ సంబంధం మోజులో పడి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధార్వాడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు మహేష్. అతడికి ఇటీవల తన అక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతో కాపురం చేయడం లేదు. మరో మహిళ విజయలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరు హుబ్లీ నవనరగ గామనగట్టి కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. భార్యను పూర్తిగా వదిలేసి.. ఆమె దగ్గరే ఉంటున్నాడు. 15 రోజులుగా ఇదే వరుస.
అయితే మూడు రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో పాటు ఫోను చేసిన స్పందించకపోవడంతో ఏం జరిగి ఉంటుందని, వారి ఇంటికి వెళ్లారు. పిలిచినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. మహేష్, విజయ లక్ష్మి ఇద్దరు ఒకే చీరకు ఉరి వేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను శవ పరీక్ష కోసం తరలించారు. కాగా, వీరిద్దరు మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, విజయలక్ష్మి సోదరి మాట్లాడుతూ.. తన అక్క చాలా మంచిదని, ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాందంటూ ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఇది సూసైడ్ కాదని, అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ నవనగర్ పోలీస్ స్టేషన్ లో రెండు వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. ఇది ఆత్మహత్య లేక.. మరేదేమైనా కోణంలో విచారణ చేపడుతున్నారు.