స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన మూడో తరగతి విద్యార్థి!

స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన మూడో తరగతి విద్యార్థి!

నేటికాలం పిల్లలపై సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం బాగా ఉంది. ఈ సోషల్ మీడియా ప్రభావం కారణంగా పిల్లలు చెడు వైపు ఆకర్షితులవుతున్నారు.  ఈ క్రమంలో దారుణమైన అఘాయిత్యాలకు, ఘోరాలకు పాల్పడుతున్నారు. కొందరు పిల్లలు సినిమాల్లో చేసినట్లు చేయడానికి, తమను తాము శక్తివంతమైన వారిగా ఊహించుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. పట్టుమని పదేళ్లు లేని పిల్లలు కూడా ఈ సినిమాలను చూసి వింత వింత పనులు చేస్తున్నారు. స్పైడర్ మెన్, సూపర్ మెన్, ఐరన్ మ్యాన్ వంటి సినిమాలు చూసి.. తాము అలా చేశాయని భావిస్తారు. ఇలా చేసి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో పిల్లలు ఉన్నారు. తాజాగా మూడో తరగతి విద్యార్ధి సినిమాలను చూసి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాన్పూర్‌ కు చెందిన డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ స్కూల్‌లో  ఓ  విద్యార్ధి మూడో తరగతి చదువుతున్నాడు. కాన్పూర్ పరిధిలోని అనిల్ కాలనీకి చెందిన ప్రముఖ డ్రగ్గిస్ట్ కుమారుడైన ఈ విద్యార్థి  పాఠశాల మొదటి అంతస్తు రెయిలింగ్ నుండి దూకాడు. ఇటీవల క్రిష్ సినిమాలో  హృతిక్ రోషన్ చేసిన యాక్షన్ సీన్లు ఆ  బాలుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.  సినిమాలో హీరో చేసినట్లుగా  తాను చేసేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో తరగతి గది నుంచి బయటకు వచ్చి..  మొదటి అంతస్తు రెయిలింగ్ పైకి ఎక్కాడు. అందరూ చూస్తుండగా రెయిలింగ్ నుంచి  ఒక్కసారిగా కిందకు దూకేశాడు.

15 అడుగుల ఎత్తు నుంచి కింద పడగానే ముక్కు, కాళ్లు, చేతులకు  తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని గమనించి పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.  అతడి ప్రాణాలకు ముప్పు తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల సమయంలో మంచినీరు తాగేందుకని చెప్పి.. ఆ విద్యార్థి బయటకు వచ్చాడు. ఇక క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్ లాగా తాను విన్యాసాలను చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ విద్యార్థి తీసుకున్న ఈ దారుణ నిర్ణయం వెనక ఎవరి ప్రమేయం లేదని, పక్కనే తోటి విద్యార్థులు ఉన్నప్పటికీ వారి బలవంతమేమి లేదని పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు.  అయితే ఆ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. ఘటన స్థలాని చేరుకున్నారు.

అయితే అక్కడ విద్యార్థి తల్లి తెలిపిన విషయాలుఅందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. తమ కుమారుడు తరచూ క్రిష్ ను సూపర్ హీరోగా చెప్పడం.. అతనిలాగా తాను స్టంట్స్ చేయాలని ఉందని ఆ విద్యార్థి చెప్పేవాడంట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంత చిన్న వయస్సులో అలాంటి సాహసం చేయడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అందుకే పిల్లలకు అతిగా ఫోన్లు, సినిమాలు చూపించకుడదని, నిత్యంపై వారిని తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. సినిమాలను, ఇతర షోల్లో చేసే వాటిని అనుకరించి చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు.  మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: ఇలాంటి బతుకు నాకొద్దు! కంటతడి పెట్టిస్తున్నయువతి మరణం!

Show comments