iDreamPost
android-app
ios-app

ఇలాంటి బతుకు నాకొద్దు! కంటతడి పెట్టిస్తున్నయువతి మరణం!

  • Published Jul 21, 2023 | 5:54 PM Updated Updated Jul 21, 2023 | 5:54 PM
  • Published Jul 21, 2023 | 5:54 PMUpdated Jul 21, 2023 | 5:54 PM
ఇలాంటి బతుకు నాకొద్దు! కంటతడి పెట్టిస్తున్నయువతి మరణం!

నేటి కాలం యువత ప్రతీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నారు. చదువులో ఫెయిల్ అయ్యానని, ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని.., ఇలా అనేక రకాల కారణాలు చూపూతు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవాళ్లకి కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాగే భావించిన ఓయువతి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో శ్రావణి అనే యువతి నివాసం ఉంటుంది. ఈ యువతి గత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గమనించి గతంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి శ్రావణి మందులు వాడుతూనే ఉంది. ఇకపోతే ఇటీవల కూడా శ్రావణికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. శ్రావణి ఆ నొప్పిని భరించలేకపోయింది. ఇక ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుందో ఏమో కానీ.. స్లిపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లమని సూచించారు. దీంతో శ్రావణి కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆ యువతి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. శ్రావణి మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సొంత చెల్లిని హత్య చేసి తలతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetci girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio