iDreamPost
android-app
ios-app

వీడియో: విద్యార్థినితో మత గురువు గలీజ్ పని! అక్కడ తాకుతూ ముద్దులు పెట్టాడు!

వీడియో: విద్యార్థినితో మత గురువు గలీజ్ పని! అక్కడ తాకుతూ ముద్దులు పెట్టాడు!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు పాడు పనులకు తెర లేపుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు గురువులు అందమైన విద్యార్థినులను టార్గెట్ చేస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక అవకాశం దొరికితే అత్యాచారం చేసి చివరికి కోరిక తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అచ్చం ఇలాగే రెచ్చిపోయాడో మత గురువు. ఓ విద్యార్థినితో గలీజ్ పనికి తెర లేపి ఆమెను అక్కడ తాకుతూ ఆనందాన్ని పొందాడు. ఇదంతా కొందరు వ్యక్తులు గమనించి ఆ గురువు బండారాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ లోని సివాన్ జిల్లా అందర్ ప్రాంతంలో ఓ మత గురువు భూతవైద్యం చేస్తున్నాడు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోని మహిళలు, యువత, విద్యార్థులు ఈ మత గురువు వద్దకు వస్తుంటారు. ఇలా నమ్మి వచ్చిన వారితో ఈ ఫేక్ బాబా అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం ఏంటంటే? ఇటీవల ఓ విద్యార్థిని ఆ మత గురువు వద్దను ఆశ్రయించింది. ఆ యువతి అందాన్ని చూసి ఈ కామంధుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను అక్కడక్కడా తాకుతూ ముద్దులు పెట్టాడు. అనంతరం గట్టిగా పట్టుకుని ఏదేదో చేయబోయాడు. ఆ సమయంలో ఆ యువతి ప్రతిఘటిస్తుంటే చేతితో లాగి తన వద్దకు తీసుకున్నాడు.

ఇదంతా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగచాటును గమనించారు. అక్కడ జరుగుతున్నదంతా సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక ఇదే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మొత్తానికి అతని బండారం బయటపడింది. చివరికి అదే వీడియో స్థానిక పోలీసుల వరకు కూడా వెళ్లింది. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గురువు పేరుతో విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ ఫేక్ బాబా తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: దారుణం.. కుక్కలకు విషం పెట్టి చంపిన దుండగులు