Dharani
Bhagalpur Woman Constable Death: ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ వివరాలు..
Bhagalpur Woman Constable Death: ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ వివరాలు..
Dharani
ఆమె నలుగురికి ఆదర్శంగా నిలిచే వృత్తిలో ఉంది. సమాజాన్ని కాపాడే గౌరవప్రదమైన పోలీసు జాబ్ చేస్తుంది. మరి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆమె.. చేసిన ఓ తప్పు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని బలి తీసుకుంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి ఆగ్రహించిన ఆమె భర్త.. వారి ప్రేమకు గుర్తు పుట్టిన ఇద్దరు చిన్నారులతో పాటు భార్య, తల్లిని హత్య చేసి.. తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్ నీతూ కుమారి తన కుటుంబంతో కలిసి పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నది. ఆమెది ప్రేమ వివాహం. కొన్నాళ్ల క్రితం పంకజ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాబు శివాంశ్ వయసు నాలుగున్నర ఏళ్లు కాగా.. శ్రియ అనే మూడున్నర ఏళ్ల పాప సంతానం ఉంది. నీతూ తన భర్త పంకజ్, ఇద్దరు పిల్లలు, అత్త ఆశాదేవితో కలిసి భాగల్పూర్ పోలీస్ క్వార్టర్ లో నివాసం ఉంటుంది. అయితే గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
ఇలా ఉండగా.. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పాల వ్యక్తి వారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరూ స్పందించకపోవడంతో పొరుగువారికి ఈ విషయం చెప్పాడు. అయినా నీతు కుమారి క్వార్టర్ నుంచి ఎలాంటి అలికిడి లేదు. దాంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి.. తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. మహిళా కానిస్టేబుల్ నీతూ కుమారి, ఆమె పిల్లలు, అత్త గొంతు కోసి ఉండి మరణించగా, భర్త పంకజ్ మృతదేహం సీలింగ్‌కు వేలాడటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు నీతూ ఇంట్లో ఆమె భర్త పంకజ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. తన తల్లి, ఇద్దరు పిల్లల గొంతు కోసి నీతూ హత్య చేసిందని సూసైడ్ నోట్‌లో అతడు ఆరోపించాడు. దీంతో ఆవేశం పట్టలేక తాను తన భార్య నీతూ గొంతు కోసి హత్య చేశానని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో రాసుకొచ్చాడు. అంతేకాక నీతుకు, మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే తన తల్లి, పిల్లలను ఆమె చంపిందని సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. అయితే పంకజ్ తన కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.