ఆ ఆహారం కావాలి.. జైలు ఫుడ్ పై దర్శన్ కీలక వ్యాఖ్యలు!

Darshan Thoogudeepa: రేణుకాస్వామి హత్యా ఘటన కన్నడ రాష్ట్రంతో పాటు దేశమంత సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రా గౌడ నిందితులుగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Darshan Thoogudeepa: రేణుకాస్వామి హత్యా ఘటన కన్నడ రాష్ట్రంతో పాటు దేశమంత సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రా గౌడ నిందితులుగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కన్నడ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అభిమానినే చంపిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పరప్పన ఆగ్రహారం జైల్లో ఉన్నాడు. రేణుకాస్వామి హత్యా ఘటన కన్నడ రాష్ట్రంతో పాటు దేశమంత సంచలనంగా మారింది. చిత్రదుర్గంకు చెందిన తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా చంపిన కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రా గౌడ నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు మరికొందరు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. దర్శన్.. బెయిల్ కోసం పలుమార్లు కోర్టులో పిటిషన్ వేసినా…ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం జైల్లో ఉన్న దర్శన అక్కడి ఫుడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి..

రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్రాగౌడ తో పాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన బెంగళూరు..దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇదే సమయంలో జైల్లో ఉన్న దర్శన్.. అక్కడి ఫుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జైలు తిండి పడటం లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడాని అనుమతి ఇవ్వాలంటూ..ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దర్శన్ వేసిన పిటిషన్ పై  ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం నాడు హైకోర్టులో విచారణ సాగింది.

ఇక తన పిటిషన్ లో పలు అంశాలను దర్శన్ ప్రస్తావించారు. తనకు ఇంటి భోజనం కావాలని,  అలానే పరుపు, దిండు, చదువుకోవడానికి కొన్న పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు. అయితే అతడి పిటిషన్ కి కౌంటర్ గా ప్రభుత్వ న్యాయవాది కీలక అంశాలను కోర్టులు విన్నవించారు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు హోం ఫుడ్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ లాయర్ తెలిపారు.

అయితే అలా జైలు అధికారులను ఎవర్నీ దర్శన్‌ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు కోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. వీరి వారి జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. ఇక రేణుకా స్వామి హత్య ఘటన కన్నడ ఇండస్ట్రీని ఉల్కిపడేలా చేసిన సంగతి తెలిసింది. అప్పటి వరకు అందరి దృష్టిలో హీరో గా ఉన్న దర్శన్.. ఒక్కసారిగా నిందితుడిగా మారిపోయారు.

Show comments