6-Month-old Baby: షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!

షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!

గతంలో తెలంగాణలోని ఓ ఆస్పత్రిలోని రోగులపై ఎలుకలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే.. ఇటీవల 6 నెలల పసికందును ఎలుకలు దాడి చేసి చంపేశాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మరో విషయం ఏంటంటే? ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల పేరెంట్స్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలోని ఇండియానా ప్రాంతంలో డేవిడ్- ఏంజెల్ షోనాబామ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 6 నెలల కిందట ఓ బిడ్డ జన్మించింది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 13న వీరి చిన్నారిని ఇంట్లో ఊయలలో పడుకోబెట్టారు. ఈ క్రమంలోనే కొన్ని ఎలుకలు ఆ ఊయలలో చేరి ఆ పసికందుపై 50కిపైగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఎలుకల దాడిలో ఏకంగా ఆ చిన్నారి ఎముకలు సైతం బయటపడ్డట్లు సమాచారం. ఈ ఘటనలో ఆ 6 నెలల పసికందు మృతి చెందింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను విచారించగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్రత వల్లే ఇంట్లోకి ఎలుకలు వచ్చాయని, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చిన్నారి పేరెంట్స్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఎలుకల దాడిలో మరణించిన 6 నెలల చిన్నారి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments