Arjun Suravaram
Zomato for Enterprise: ఆ పుడ్ సేవలు అందించే ప్రముఖ సంస్థల్లో జొమాటో ఒకటి. మెరుగైన సేవలు అందిస్తూ జొమాటో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తరచూ వినియోగదారుల కోసం కొత్త సేవలను అమలు చేస్తుంది. తాజాగా మరో కొత్త సేవలకు జొమాటో శ్రీకారం చుట్టింది.
Zomato for Enterprise: ఆ పుడ్ సేవలు అందించే ప్రముఖ సంస్థల్లో జొమాటో ఒకటి. మెరుగైన సేవలు అందిస్తూ జొమాటో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తరచూ వినియోగదారుల కోసం కొత్త సేవలను అమలు చేస్తుంది. తాజాగా మరో కొత్త సేవలకు జొమాటో శ్రీకారం చుట్టింది.
Arjun Suravaram
నేటికాలంలో అందరూ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లకు బాగా అలవాటు పడ్డారు. ముఖ్యంగా సిటీల్లో అయితే ఏ ఫుడ్ కావాలన్న.. ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ బాగా ఉండటంతో సమయంతో సంబంధం లేకుండా ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సేవలు కొనసాగుతూ ఉంటాయి. ఆ సేవలు అందించే వాటిల్లో ప్రముఖ సంస్థ జొమాటో మంచి ఆదరణ ఉంది. మెరుగైన సేవలు అందిస్తూ జొమాటో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తరచూ వినియోగదారుల కోసం కొత్త సేవలను అమలు చేస్తుంది. అందులో భాగంగానే జొమాటో ఇప్పుడు కొత్త సేవను అందించేందుకు శ్రీకారం చుట్టింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ కార్పొరేట్ ఉద్యోగులు చేసే ఆర్డర్ల కోసం జొమాటో ఫర్ ఎంటర్ ప్రైజెస్(జీఎఫ్ఎఫ్) పేరుతో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఈ సదపాయం కంపెనీల ఆహార ఖర్చుల నిర్వహణను ఈజీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు పేర్కొన్నారు. అంతేకాక జొమాటోకు ఎక్కువగా వచ్చే ఆర్డర్లలో కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు చేసే బిజినెస్ ఆర్డర్లే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ల విషయంలో కాస్తా గందరగోళం ఉండేదని పేర్కొన్నారు. ముందుగా ఆహారం ఖర్చును ఎంప్లాయిస్ చెల్లిస్తే..తరువాత వారి కంపెనీలు రీయింబర్స్ చేస్తుంటాయని ఆయన తెలిపారు. అయితే ఈ విధానంలో కొంత గందరగోళంతో పాటు కాలయాపన జరుగుతోందని గోయల్ పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను తమ కొత్త సేవలతో పరిష్కరించ వచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ సేవలను టాప్ కంపెనీలు వినియోగించుకుంటున్నాయని, ఆయా సంస్థలు ఇచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టినట్లు గోయల్ పేర్కొన్నారు.
జొమాటో ఫర్ ఎంటర్‌ప్రైజెస్ సేవల ద్వారా ఉద్యోగులు చేసే తమ ఆర్డర్లకు గానూ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కంపెనీ యాజమాన్యమే చెల్లిస్తుంది. ఈ పుడ్ ఆర్డర్లను చేసే ఎంప్లాయిస్, వారి బడ్జెట్‌ను యాజమాన్యమే ఏర్పాటు చేసే సౌలభ్యం ఉంది. కంపెనీలు కావాలంటే ఆర్డర్లకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్సు నిర్దేశించొచ్చని జొమాటో పేర్కొంది. ఇటీవల ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ సేవలకు స్వస్తి పలికిన విషయం తెలిసింది. ఆ సేవలను నిలిపివేసిన వారానికే ఈ సేవలకు జొమాటో శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ కొత్త సేవల ద్వారా దేశంలోని ప్రముఖ ప్రాంతాల నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. మరి.. జొమాటో తీసుకొచ్చిన ఈ కొత్త సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Excited to introduce Zomato for Enterprise (ZFE), a platform designed for companies to solve food expense management.
A lot of Zomato orders placed by corporate employees are business-related and need to be reimbursed by the company. The reimbursement process is cumbersome and… pic.twitter.com/6WU8gt9fVH
— Deepinder Goyal (@deepigoyal) August 28, 2024