పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. ఒక్కసారి 5 లక్షలు కడితే చాలు.. వడ్డీతోనే లక్షల్లో లాభం పక్కా!

Post Office,Post office time deposit scheme: మీరు ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ ఉంది. ఒక్కసారి 5 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలోనే లక్షల్లో లాభం పొందొచ్చు.

Post Office,Post office time deposit scheme: మీరు ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ ఉంది. ఒక్కసారి 5 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలోనే లక్షల్లో లాభం పొందొచ్చు.

డబ్బు సంపాదించడం ఓ కల. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు రాజీలేని పోరాటం చేస్తుంటారు. చేతిలో సరిపడా డబ్బుంటే లైఫ్ లో ఆ కిక్కే వేరు. ఈ రోజుల్లో ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నది. అందుకే అంతా డబ్బుకు ప్రియారిటీ ఇస్తున్నారు. డబ్బు ఎలా సంపాదించాలి? సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి? ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు కూడా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడిపెడితే వడ్డీ రూపంలోనే లక్షల్లో లాభం అందుకోవచ్చు.

పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పోస్టాఫీస్ అందించే పథకాల్లో అధిక వడ్డీ అందిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందొచ్చు. ప్రభుత్వ పథకం కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. కాగా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. వడ్డీ రూపంలో అధిక ఆదాయాన్ని పొందొచ్చు. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి.

ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ, రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 7.0. శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఐదేళ్ల టైమ్ పిరియడ్ కు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7,24,149 పొందొచ్చు. అంటే మీకు పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే రూ. 2,24,974 చేతికి అందుతుంది. ఈ మొత్తాన్ని తీయకుండా మరో ఐదేళ్లు పొడిగించుకున్నట్లైతే పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీతో కలిపి 10 లక్షల వరకు అందుకోవచ్చు.

Show comments