నెలకు 20 వేల ఆదాయం కావాలా? బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ ఇదే

Senior Citizen Savings Scheme: నెలకు కొంత ఆదాయాన్ని కోరుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకు 20 వేలు పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

Senior Citizen Savings Scheme: నెలకు కొంత ఆదాయాన్ని కోరుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకు 20 వేలు పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

ప్రస్తుత రోజుల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్థిక అసరాల దృష్ట్యా అందరు పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు చేయాలనే భావనకు వస్తున్నారు. మరికొంత మంది అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా నెలకు కొంత ఆదాయం కావాలని కోరుకుంటున్నారా? అయితే మీ వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల కొంత ఆదాయాన్ని పొందొచ్చు. పోస్టాఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేల ఆదాయం పొందొచ్చు.

సీనియర్ సిటిజన్లకు రిటైర్ మెంట్ తర్వాత వారి ఆర్థిక అవసరాలకు కొంత డబ్బు అవసరం పడుతుంది. జాబ్ చేస్తున్నప్పుడైతే నెలకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ చింతా ఉండదు. కానీ పదవీ విరమణ తర్వాత డబ్బుకు లోటు ఉండకూడదంటే పోస్టాఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20,500 పొందొచ్చు. ఈ పథకంలో ఒక్కసారి కడితే చాలు. ఐదు సంవత్సరాల పాటు నెల నెలా ఆదాయం పొందొచ్చు. 60 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని అందిస్తున్నది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో కనీసం రూ. 1000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు ఒకసారి రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మీకు ప్రతి సంవత్సరం రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అంటే, మీరు నెలవారీ ప్రాతిపదికన రూ. 20,500 అందుకుంటారు. ఈ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుపై ఆధారపడి మీ ఆదాయం ఉంటుందన్నమాట. ప్రభుత్వ పథకం కాబట్టి సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడులతో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇది బెస్ట్ స్కీమ్ అంటున్నారు నిపుణులు.ల

Show comments