లక్షాధికారిని చేసే పోస్టాఫీస్ స్కీమ్.. రోజుకు 95 పెట్టుబడితో.. చేతికి 14 లక్షలు

Gram sumangal scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడిపెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి లక్షాధికారి అయిపోవచ్చు.

Gram sumangal scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడిపెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి లక్షాధికారి అయిపోవచ్చు.

ప్రస్తుత రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో అందరు డబ్బు సంపాదనపై దృష్టిసారిస్తున్నారు. సంపాదించిన దాన్ని మంచి రాబడినిచ్చే పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇలాంటి వాటిల్లో పెట్టుబడి అనేది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. మీ పెట్టుబడి సురక్షితంగా ఉండి గ్యారంటీ రిటర్స్న్ అందుకోవాలంటే ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీమ్మల్ని లక్షాధికారిని చేసే పోస్టాఫీస్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో రోజుకు రూ. 95 పెట్టుబడితో చేతికి ఏకంగా 14 లక్షలు పొందొచ్చు.

పోస్టాఫీస్ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాల్లో పెట్టుబడిపై మంచి వడ్డీరేటును అందిస్తున్నది. దీంతో పెట్టుబడిదారులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే పోస్టాఫీస్ అందించే మరో పథకం గ్రామ్ సుమంగళ్ గ్రామీణ డాక్ జీవన్ బీమా యోజన. దీనిలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం పొందొచ్చు. ఇది మనీ-బ్యాక్ ప్లాన్. ఇది జీవిత బీమాను కవర్ చేయడంతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తుంది. ఈ స్కీమ్ లో కేవలం రూ.95 డిపాజిట్ చేయడం ద్వారా ఈ పథకంలో మెచ్యూరిటీపై దాదాపు రూ. 14 లక్షలు పొందవచ్చు.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే 19 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. పాలసీ పెట్టుబడి వ్యవధి కాలం 15 నుంచి 20 సంవత్సారాలుగా ఉంటుంది. మీరు 15 ఏళ్ల వరకు పాలసీలో ఉన్నట్లైతే.. 20-20 శాతం ఫార్ములా ఆధారంగా ఆరు, తొమ్మిది, పన్నెండేళ్ల తర్వాత హామీ మొత్తం అందుబాటులోకి వస్తుంది. మీరు 20 ఏళ్ల వరకు ఈ పాలసీలో కొనసాగితే.. ప్రతి ఎనిమిది, పన్నెండు, పదహారు సంవత్సరాలకు 20 శాతం మొత్తాన్ని తిరిగి పొందుతారు. 25 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెడితే ఈ పథకంలో రూ. 7 లక్షల హామీతో 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అంటే ప్రతి నెలా రూ. 2,853 అంటే రోజుకు దాదాపు రూ. 95 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడిదారుడు దాదాపు రూ.14 లక్షలు పొందుతారు.

Show comments