P Venkatesh
LIC New Jeevan Shanti Policy: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీలో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఒక్కసారి కడితే నెలకు 8 వేలు పొందొచ్చు.
LIC New Jeevan Shanti Policy: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీలో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఒక్కసారి కడితే నెలకు 8 వేలు పొందొచ్చు.
P Venkatesh
డబ్బు చేతిలో ఉంటే ఆ ధైర్యమే వేరు. అందుకే అందరు డబ్బు ఎలా సంపాదించాలి. రెట్టింపు ఎలా చేసుకోవాలి. మనీ సంపాదించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలేంటి? అని ఆలోచిస్తున్నారు. చాలా మంది పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. అయితే పొదుపును తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ఇక పదవీ విరమణ సమయంలో డబ్బుకు ఏ లోటు ఉండకూడదంటే ముందు నుంచే వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడితే ఏ చింతా లేకుండా జీవించొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో న్యూ జీవన్ శాంతి ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో ఒక్కసారి కడితే నెలకు 8 వేల ఆదాయం పొందొచ్చు.
జాబ్ చేస్తున్నతం కాలం శాలరీ వస్తుంది కాబట్టి అవసరాలకు ఏ లోటు ఉండదు. కానీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ డబ్బులు సరిపోకపోవచ్చు. మీరు ముందుగానే ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ తర్వాత నెల నెలా ఆదాయం పొందొచ్చు. ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారు ఎల్ఐసీ అందించే న్యూ జీవన్ శాంతి ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఈ పాలసీలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. ఏ రిస్క్ ఉండదు. ఈ పాలసీలో 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. నెలకు 8 వేల ఆదాయం పొందడానికి ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీలో 55 ఏళ్ల వ్యక్తి.. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ రూపంలో రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. అప్పుడు సంవత్సరానికి రూ. 1,01,880 పెన్షన్ వస్తుంది. నెలవారీ లెక్కన చూస్తే ఇది రూ. 8,149 వరకు ఉంటుంది. లైఫ్ లాంగ్ ఈ పెన్షన్ పొందొచ్చు. ఈ న్యూ జీవన్ శాంతి ప్లాన్‌లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1.50 లక్షలు. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ పెట్టుబడిపై ఆధారపడి పెన్షన్ వస్తుంది. ఇక పాలసీ మధ్యలో పాలసీదారులు మరణిస్తే.. అకౌంట్లో జమ చేసిన మొత్తం నామినీకి వస్తాయి. ప్రభుత్వరంగానికి చెందిన సంస్థ కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.