P Venkatesh
మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు ఇన్వెస్ట్ చేసేదానిపై మంచి రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన పోస్టాఫీస్ పథకం అందుబాటులో ఉంది.
మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు ఇన్వెస్ట్ చేసేదానిపై మంచి రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన పోస్టాఫీస్ పథకం అందుబాటులో ఉంది.
P Venkatesh
డబ్బుకు ప్రాధాన్యత పెరిగిన నాటి నుంచి సంపాదన కోసం ఆలోచించే విధానమే మారిపోయింది. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు ఓ వైపు.. చాలీ చాలని జీతాలు మరోవైపు. ఈ నేపథ్యంలో చాలా మంది రెండో ఆదాయంపై దృష్టిసారిస్తున్నారు. మరికొంత మంది వారి వద్ద ఉన్న డబ్బును మంచి రాబడి వచ్చే స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకొంతమంది స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడిపెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టి అధిక రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసం అద్భుతమైన పోస్టాఫీస్ పథకం అందుబాటులో ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక ఆదాయం పొందొచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న పోస్టాఫీస్ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ఈ పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడిపెడితే మీ డబ్బు రెట్టింపు అయినట్లే. మీరు మీ సంపాదనలో ప్రతి నెల కొంత మొత్తాన్ని ఆదా చేసి ఇన్వెస్ట్ చేసినట్లైతే మంచి ఆదాయం పొందొచ్చు. పోస్టాఫీస్ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకోసారి చిన్న పొదుపు పథకాలపై అందుబాటులో ఉన్న వడ్డీని సమీక్షిస్తుంది.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. ప్రతి నెల రూ. 2000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 24,000 అవుతుంది. ఐదు సంవత్సరాల్లో రూ. 1,20,000 పెట్టుబడి పెడతారు. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ. 22, 732 పొందుతారు. అంటే ఫైనల్ గా మీ రికరింగ్ డిపాజిట్ మెచ్చూరిటీపై మొత్తం రూ.1,42,732 రాబడిని అందుకుంటారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. ప్రతి నెల రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 60,000 అవుతుంది. ఐదు సంవత్సరాల్లో రూ. 3,00,000 పెట్టుబడి పెడతారు. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ.56,830 పొందుతారు. అంటే ఫైనల్ గా మీ రికరింగ్ డిపాజిట్ మెచ్చూరిటీపై మొత్తం రూ.3,56,830 రాబడిని అందుకుంటారు.