అర్జెంటుగా డబ్బులు కావాలా?.. ష్యూరిటీ లేకుండానే 20 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

PM Mudra yojana: మీరు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? చేతిలో డబ్బు లేక ఆగిపోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ష్యూరిటీ లేకుండానే రూ. 20 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?

PM Mudra yojana: మీరు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? చేతిలో డబ్బు లేక ఆగిపోతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ష్యూరిటీ లేకుండానే రూ. 20 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?

ఇప్పుడు చాలా మంది ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికే ప్రియారిటీ ఇస్తున్నారు. వ్యాపారం చిన్నదైనా.. పెద్దదైనా పెట్టుబడికి డబ్బు ఉండాల్సిందే. వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునేందుకు రెడీ అవుతుంటారు. అయితే బ్యాంకులు అన్ని వివరాలు పరీశీలించాక ష్యూరిటీతో లోన్స్ మంజూరు చేస్తుంటాయి. దీనికి చాలా సమయం పడుతుంది. ఇతర వ్యక్తుల వద్ద అప్పు తెద్దామంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. మరి మీకు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే లోన్ కావాలా? అర్జెంటుగా డబ్బులు కావాలంటే కేంద్రం అందించే ముద్ర లోన్స్ ద్వారా పొందొచ్చు. ష్యూరిటీ లేకుండా ఏకంగా రూ. 20 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?

సామాన్య ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ లను తీసుకొస్తున్నది. దీనిలో భాగంగానే చిన్న వ్యాపారం చేసుకునే వ్యాపారులకు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు లోన్లు అందించడం కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ఈ స్కీం ద్వారా ఎలాంటి పూచీకత్తు (ష్యూరిటీ) లేకుండానే రూ. 10 లక్షల వరకు లోన్లు పొందే అవకాశం ఉండేది. అయితే ఇటీవల 2024-25 బడ్జెట్ సమయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని డబుల్ చేసింది. దీంతో ముద్ర యోజన పథకం ద్వారా ఇప్పుడు రూ. 20 లక్షలు లోన్ పొందే అవకాశం ఉంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు, మహిళలు తమ వ్యాపారాల్ని మరింత మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు ఈ పథకం ద్వారా లోన్స్ పొందొచ్చు.

ప్రధానమంత్రి ముద్ర యోజన లోన్ల రకాలు:

ఈ పథకం కింద 3 రకాల లోన్లు అందిస్తారు. మొదటిది శిశు లోన్. దీని కింద రూ. 50 వేల వరకు లోన్ అందిస్తారు. రెండోది కిషోర్ లోన్ దీని ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్ అందుకోవచ్చు. మూడోది తరుణ్ లోన్.. దీని ద్వారా రూ. 5 నుంచి 10 లక్షల వరకు గతంలో ఉండగా.. ఇప్పుడు ఇది రూ. 20 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది.

అర్హులు ఎవరంటే?

18 ఏళ్లు నిండి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన వివరాలు, డాక్యూమెంట్స్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు బ్యాంకు కోరిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్కీం లోన్ రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందేందుకు ముద్రా యోజన Mudra.org.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ఫాం డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి బ్యాంకులో సబ్ మిట్ చేయాలి. వెరిఫికేషన్ అనంతరం అర్హులుగా గుర్తిస్తే బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. మరి మీరు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీం ద్వారా లోన్ పొంది మీ కలల్ని నిజం చేసుకోండి.

Show comments