సిరులు కురిపించే పోస్టాఫీస్ స్కీమ్.. రోజుకు 166 పెట్టుబడితో.. చేతికి 16 లక్షలు

Public Provident Fund: మీరు పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో రోజుకు 166 ఇన్వెస్ట్ చేస్తే చాలు చేతికి రూ. 16 లక్షలు అందుకోవచ్చు. ఎలా అంటే?

Public Provident Fund: మీరు పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో రోజుకు 166 ఇన్వెస్ట్ చేస్తే చాలు చేతికి రూ. 16 లక్షలు అందుకోవచ్చు. ఎలా అంటే?

కష్టపడి సంపాదించిన సొమ్మును మంచి ఆదాయం వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావించే వారు చాలమందే ఉన్నారు. కొంతమంది బ్యాంకుల్లో ఎఫ్డీలు చేస్తారు. ఎల్ఐసీ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. మరికొంత మంది ప్రభుత్వం అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను పొందాలని చూస్తుంటారు. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడిపెడితే లక్షల్లో లాభం అందుకోవచ్చు. రోజుకు రూ. 166 పెట్టుబడితో చేతికి 16 లక్షలు వస్తాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడిని అందుకోవచ్చు. పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీని అందుకోవచ్చు. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోవొచ్చు. ఎవరైనా వ్యక్తి గానీ.. మైనర్ పేరిట గానీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏటా కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడిపెట్టొచ్చు. 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేయకపోతే అకౌంట్ నిలిచిపోతుంది. బ్యాంకుతో పాటు, మీరు పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించొచ్చు. పీపీఎఫ్ స్కీమ్‌లో వడ్డీ ప్రతి నెలా లెక్కిస్తారు. ప్రతి నెలా ఐదో తేదీ లోపు ఉన్న నగదుపై వడ్డీ లెక్కిస్తుంటారు.

పీపీఎఫ్ పథకంలో ప్రతి రోజు రూ. 166 అంటే.. నెలకు రూ. 5 వేల చొప్పున డిపాజిట్ చేస్తే సంత్సరానికి రూ. 60 వేలు అవుతుంది. ఈ పథకం కాల వ్యవధి 15 సంవత్సరాలకు రూ. 9 లక్షల పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీరేటుతో వడ్డీతోనే రూ. 7,27,284 సమకూరుతుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీతో కలిపి మొత్తం చేతికి రూ. 16,27,284 అందుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

Show comments