P Venkatesh
బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి అయిన పాన్ కార్డులో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలని చూస్తున్నారా. అయితే ఆన్ లైన్ లోనే ఇలా సులభంగా మార్చుకోండి.
బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి అయిన పాన్ కార్డులో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలని చూస్తున్నారా. అయితే ఆన్ లైన్ లోనే ఇలా సులభంగా మార్చుకోండి.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డు తప్పని సరి అయ్యింది. దేశంలో ఐడెంటిటీ కార్డుల్లో ఒకటిగా పాన్ కార్డు ఉపయోగపడుతోంది. ఆధార్, ఓటర్ ఐడీల మాదిరిగానే పాన్ కార్డును కూడా ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పాన్ కార్డును ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ జారీ చేస్తుంది. బ్యాంకులో ఖాతా తెరవడానికి ఆధార్ తో పాటు పాన్ కార్డు కూడా తప్పనిసరి. అంతేకాదు ఆర్థిక లావాదేవీలకు కూడా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. బ్యాంకులో రూ. 50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన పాన్ కార్డులో మన వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లుతుంటాయి. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో చాలా మందికి తెలియదు. ఆన్ లైన్ లోనే పాన్ కార్డులో మార్పులు ఈజీగా చేసుకోవచ్చు. అదెలా అంటే?
డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డు అవసరం. క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేయాలన్నా అవసరమే. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన క్రయ విక్రయాల్లో కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును వినియోగిస్తుంటారు. ఈ పాన్ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫొటో, పుట్టినతేదీ, సంతకం, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి. అయితే ఒక్కోసారి వ్యక్తిగత వివరాలకు సంబంధించి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లైన మహిళలు పాన్ కార్డులో తమ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటారు. అయితే పాన్ కార్డులో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా ఇంటి వద్దనే ఆన్ లైన్ లో సరిచేసుకోవచ్చు.