P Venkatesh
బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్. బైక్ రైడ్ అంటే ఇష్టడే వారికి ఒకప్పుడు యూత్ ను ఊపేసిన బైక్ మళ్లీ అందుబాటులోకి రానుంది. నయా టెక్నాలజీతో మళ్లీ తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్. బైక్ రైడ్ అంటే ఇష్టడే వారికి ఒకప్పుడు యూత్ ను ఊపేసిన బైక్ మళ్లీ అందుబాటులోకి రానుంది. నయా టెక్నాలజీతో మళ్లీ తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
P Venkatesh
బైక్ రైడింగ్ చేయడానికి యూత్ ఎక్కువగా ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో డ్యూక్, పల్సర్ వంటి బైకులకు యూత్ లో క్రేజ్ ఎక్కువ. అయితే వీటికి మించి మరో బైక్ ఉంది. ఒకప్పుడు భారత్ లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. టూవీలర్ లో తిరుగులేని బైక్ గా నిలిచి యూత్ కలల బైక్ గా మిగిలిపోయింది. అదే యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్. ఈ బైక్ కోసం యూత్ ఎంతో మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ లో దొరికినా సరే ఖర్చుకు వెనకాడకుండా కొందామని చూసేవారు కోకొల్లలు. యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్ ను అంతల ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. త్వరలోనే ఆర్‌ఎక్స్ 100 వాహనం మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది.
బైక్ లవర్స్ నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో యమహా ఆర్‌ఎక్స్ 100 తిరిగి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జపాన్‌కు చెందిన యమహా కంపెనీ 1980లో ఆర్‌ఎక్స్ 100 బైక్‌ను ఉత్పత్తి ప్రారంభించింది. 1985 నుంచి 96 వరకు టూ స్ట్రోక్ మైటార్ సైకిల్‌ను తయారుచేసింది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనల కారణంగా 2005లో ఈ బైక్ ఉత్పత్తి ఆగిపోయింది. అయితే దీనిలోని ప్రత్యేకమైన సైలెన్సర్ శబ్ధంతో ఈ బైక్ కుర్రకారును ఆకట్టుకుంది. నాటి నుంచి నేటి తరం వరకు యువత అంతా ఈ బైక్ ఫిదా అయిపోవాల్సిందే. ఈ బైక్ మార్కెట్ లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయమంటున్నారు ఆటోమొబైల్ వర్గాలు.
యమహా కంపెనీ ఆర్‌ఎక్స్ 100 బైక్‌ను తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైందని మార్కెట్ లో టాక్ వినిపిస్తోంది. యమహా ఆర్‌ఎక్స్ 100 కొత్త బైక్ ఇంజన్ సామర్థ్యం 225.9 సీసీతో ఉంటుందని తెలుస్తోంది. అదే స్టైలీష్‌తో సాధ్యమైనంత తక్కువ బరువుతో ఈ బైక్ వస్తుందని సమాచారం. ఈ బైక్ ధర రూ.1 లక్షల నుంచి రూ.లక్షన్నర మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్ మార్కెట్ లోకి వస్తే గనక ప్రస్తుతం ఉన్న బైక్ లకు గట్టిపోటీనిస్తుందని అంటున్నారు మార్కట్ నిపుణులు.