Redmi A3X: సైలెంట్‌గా భారత మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ ఏ3ఎక్స్ ఫోన్.. చౌక ధరకే బెస్ట్ ఫీచర్స్!

Redmi A3X: సైలెంట్‌గా భారత మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ ఏ3ఎక్స్ ఫోన్.. చౌక ధరకే బెస్ట్ ఫీచర్స్!

Redmi A3X Under 7K: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ భారత మార్కెట్లో సరికొత్త చౌకైన ఫోన్ ని లాంచ్ చేసింది. 7 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ తో వస్తోంది ఈ ఫోన్.

Redmi A3X Under 7K: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమీ భారత మార్కెట్లో సరికొత్త చౌకైన ఫోన్ ని లాంచ్ చేసింది. 7 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ తో వస్తోంది ఈ ఫోన్.

చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ చౌక ధరకే రెడ్మీ ఏ3ఎక్స్ పేరుతో కొత్త మోడల్ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. స్టైలిష్ గ్లాస్ బ్యాక్ డిజైన్ తో ఇది వస్తుంది. 6.71 అంగుళాల డిస్ప్లేతో 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. 500 ఎన్ఎం నిట్స్ హెచ్బీఎం బ్రైట్ నెస్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్స్ కూడా ఉండడం విశేషం. ఇందులో ఏఐ డ్యూయల్ కెమెరా సిస్టం ఇచ్చారు. సాఫ్ట్ లైట్ రింగ్, సెల్ఫీ బ్యూటీ, ఫిలిం కెమెరా, హెచ్డీఆర్ మోడ్ ఫీచర్స్ ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 1080 పిక్సెల్ లో 30 ఫ్రేమ్స్ వద్ద 1920*1080 రిజల్యూషన్ లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 720 పిక్సెల్ లో 30 ఫ్రేమ్స్ వద్ద 1280*720 రిజల్యూషన్ లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ కెమెరాలో ఫిలిం కెమెరా, హెచ్డీఆర్ మోడ్, పోర్ట్రైట్ మోడ్, టైం ల్యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో వీటితో పాటు సాఫ్ట్ లైట్ రింగ్ అదనంగా వస్తుంది. ఇందులో కూడా వీడియో రికార్డింగ్ బ్యాక్ కెమెరాలో ఉన్నట్టే ఉంది.

ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మరొకటి. 8 జీబీ వరకూ ఇంటర్నెల్ మెమొరీ ద్వారా ర్యామ్ సైజు పెంచుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ ని 1 టీబీ వరకూ విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ అల్ట్రా లార్జ్ బ్యాటరీని ఇచ్చారు. 23.96 రోజులు స్టాండ్ బై మోడ్ లో ఉంటుంది. 29.8 గంటల సేపు కాల్స్ మాట్లాడుకోవచ్చు. 135.34 గంటల పాటు మ్యూజిక్ వినచ్చు. 16.64 గంటల పాటు వీడియోలు చూసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సీ పోర్టుతో వస్తుంది. 10 వాట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తుంది. యూనిసాక్ టీ603 చిప్ సెట్ ని ఇందులో అమర్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్ తో వస్తుంది. దీంతో ఫోన్ కి మరింత ప్రొటెక్షన్ అనేది వస్తుంది.

5 లక్షల సార్లు పవర్ బటన్ టెస్ట్, 300 సార్లు రోలర్ టెస్ట్, 28 వేల సార్లు మైక్రో డ్రాప్ టెస్ట్, 10 వేల సార్లు ఛార్జింగ్ పోర్టు టెస్టులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. రెండేళ్ల ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ తో మూడేళ్ళ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని ఇస్తామని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇది ఆరా గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, మూన్ లైట్ వైట్ కలర్స్ లో లభిస్తుంది. సూపర్ స్లిమ్ బాడీతో వస్తుంది. ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 9,999 ఉండగా ఆఫర్ లో రూ. 6,999 పడుతుంది. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే కనుక అదనంగా 699 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మీరు ఈ ఫోన్ ని రూ. 6,299కే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ ఫోన్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments