Dharani
Liquor Home Delivery-Swiggy, BigBaske, Zomato: మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పవచ్చు. ఫుడ్ హోం డెలివరీ లానే మద్యం కూడా హోం డెలివరీ చేయనున్నారు. ఆ వివరాలు..
Liquor Home Delivery-Swiggy, BigBaske, Zomato: మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పవచ్చు. ఫుడ్ హోం డెలివరీ లానే మద్యం కూడా హోం డెలివరీ చేయనున్నారు. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. మనకు కావాల్సిన వాటికి సంబంధించిన యాప్స్ ఒపెన్ చేసి.. లిస్ట్ ఇస్తే చాలు.. మన ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకువస్తున్నారు. మన ఆర్డర్ వచ్చాక డబ్బులు చెల్లిస్తే సరి. వస్తువులు, పరికరాలు, దుస్తులు వంటి వాటి కొనుగోలు కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ యాప్‌లు ఉండగా.. ఫుడ్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం వరకు ఇవి కేవలం ఫుడ్ మాత్రమే డెలివరీ చేసేవి. ఇప్పుడు ఆ జాబితాలోకి కిరాణా సరుకులు, కూరగాయలు వంటివి చేరాయి. ఇక త్వరలోనే ఈ జాబితాలోకి లిక్కర్ కూడా చేరనుంది అని తెలుస్తోంది. స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్ వంటి యాప్స్‌లో లిక్కర్ హోం డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
త్వరలోనే స్విగ్గీ, బిగ్‌బాస్కెట్, జొమాటోల్లో.. తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న డ్రింక్స్ అనగా బీర్, వైన్ వంటి వాటిని హోం డెలివరీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో దీన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారని ఇంగ్లీష్ మీడియా సంస్థ ఎకానమిక్ టైమ్స్ రాసుకొచ్చింది. యాజమాన్యాలు దీని వల్ల చోటు చేసుకునే పరిణామాలను పరిశీలించే పనిలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో లిక్కర్ హోం డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంది.
కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించిన వేళ మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, అస్సాం ప్రాంతాల్లో మద్యం హోం డెలివరీకి అనుమతించారు. అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. ఇక ఇప్పటికే మద్యం హోం డెలవీర అనుమతి ఉన్న ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో ఈ విధానం తీసుకురావడం వల్ల మద్యం అమ్మకాలు 20-30 శాతం పెరిగాయని నివేదికలు వెల్లడించాయి.