జియో బాటలో వొడఫోన్ ఐడియా…రీఛార్జ్ ధరలు పెంపు! ఎంతంటే..

Vodafone Idea Recharge Plans: వొడఫోన్ ఐడియా తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్స్ ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది.

Vodafone Idea Recharge Plans: వొడఫోన్ ఐడియా తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్స్ ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది.

ఇప్పటికే సామాన్యులు వివిధ రకాల ఖర్చులతో అల్లాడిపోతున్నాడు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను చూసి.. ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే ఇలా ఉంటే.. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, దానికి రీఛార్జ్ కామన్. అయితే.. టెలికాం సంస్థలో ఆఫర్లు ఇస్తున్నట్లే ఇస్తూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. రీఛార్జ్ ధరలు పెంచుతూ టెలికాం సంస్థలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రిలయన్స్ జియో, భారతీయ ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలు పెంచిన సంగతి తెలిసింది. అయితే తాజాగా వాటి బాటలో వొడాఫోన్ ఐడియా వెళ్తోంది. తన కస్టమర్లకు షాకిస్తూ.. రిఛార్జ్ ధరలను పెంచింది. మరి.. పెరిగిన టారిఫ్ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వొడఫోన్ ఐడియా తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్స్ ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్ ఐడియా వెళ్లింది. ఈ టెలికాం సంస్ధ మూడేళ్లలో తొలిసారి రిఛార్జ్ ధఱలను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీ కోసం ఖర్చు  చేసిన వాటిని రాబట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే  భారీగా పెంచుతూ ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది.

ఇటీవలే జియో తన రీఛార్జీ ఫ్లాన్లను 13 నుంచి27 శాతంకి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఆ మరుసటి రోజే భారతీ ఎయిర్టెల్ కూడా అదే దారిలో వెళ్లి.. 10 నుంచి 21శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఆ వారి జాబితాలో వొడాఫోన్ ఐడియా వెళ్లి చేరింది. ప్రీ పెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ లను 10 నుంచి 23 శాతంకి పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెంచిన టారిఫ్ ధరలు జూలై 4 నుంచి అమల్లోకి రానున్నట్లు  తెలిపింది. ఇక ఎంట్రీ లెవన్ రీఛార్జీ ఫ్లాన్ 28 రోజుల ఫోన్ సర్వీస్ కి కనీస రీఛార్జ్ ధరను 11 శాతం పెంచింది. అంటే  రూ .179 నుంచి రూ .199 కు పెరిగింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల పరిమిత కలిగిన ప్లాన్ ధర గతంలో రూ.719  ఉండగా ఈ సారి దానిని ఏకంగా రూ .859 చేసింది.

రూ.269 ఫ్లాన్ రూ. 299కి.., అలానే రూ.299 ఫ్లాన్ రూ.349 కి, రూ.319 ఫ్లాన్ రూ.379కి పెరగనున్నాయి. అదే విధంగా కంపెనీ తన వార్షిక అన్‌లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచింది. అంటే ప్రస్తుతం ఉన్న దీని ధర రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. ఇలా అన్ని ప్రీఫెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్లపై ధరలు పెరగనున్నాయి. చివరగా 2021లో వొడఫోన్ ఐడియా తన రీఛార్జ్ ప్లాన్లను పెంచింది. తిరిగి మూడేళ్ల తరువాత మరోసారి  తన కస్టమర్లకు షాకిస్తూ.. టారిఫ్ ధరలు పెంచింది.

Show comments