Vinay Kola
Vistara: ఎయిర్ లైన్ రంగంలో సేవలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకుంది విస్తారా సంస్థ. ఈ సంస్థ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్రంగా ఉంది. తాజాగా తన సేవలను నిలిపివేయడానికి సిద్ధం అవుతుంది.
Vistara: ఎయిర్ లైన్ రంగంలో సేవలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకుంది విస్తారా సంస్థ. ఈ సంస్థ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్రంగా ఉంది. తాజాగా తన సేవలను నిలిపివేయడానికి సిద్ధం అవుతుంది.
Vinay Kola
దశాబ్ద కాలం నుంచి ఎయిర్ లైన్ రంగంలో సేవలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకుంది విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థ. ఇది గుర్గావ్‌లో ఉంది. . ఈ కంపెనీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్రంగా ఉంది. తాజాగా విస్తారా తన సేవలను నిలిపివేయడానికి సిద్ధం అవుతుంది. ఈ సంవత్సరం నవంబరు 11 దాకే విస్తారా బ్రాండుతో విమానాలు నడుస్తాయి. నవంబరు 12 నుంచి ఈ కంపెనీ టాటాకి చెందిన ఎయిర్ ఇండియా గ్రూప్‌లో కలిసిపోతుంది. అప్పటి నుంచి విస్తారా విమానాలు, సిబ్బంది ఎయిర్ ఇండియాకు బదిలీ కానున్నారని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విస్తారా ఎయిర్‌లైన్స్ 70 విమానాలని నడుపుతూ 50 ప్రాంతాలకు పైగా విమాన సేవలను అందిస్తుంది.. ఈ సంస్థలో మొత్తం 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు.
విస్తారా సంస్థ ఎయిర్ ఇండియాలో కలిసి పోవడం వలన ఈ సంస్థ సేవలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. విస్తారా విలీనం ద్వారా ఎయిర్ ఇండియా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కస్టమర్లు ఇప్పటికే తమ ప్రయాణం కోసం నవంబర్ 11 దాకా విస్తారాలో టికెట్లు బుక్ చేసుకుంటే వారికి ఎటువంటి మార్పులు జరగవు. అంటే అప్పటి దాకా వారు విస్తారా సేవలని పొందుతారు. సెప్టెంబర్ 3 నుండి నవంబర్ 11 తర్వాత ప్రయాణ బుకింగ్‌లు అనేవి ఎయిర్ ఇండియా కిందకి వస్తాయి. అంటే సెప్టెంబర్ 3 నుంచి ఎయిర్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. అప్పుడు విస్తారా సేవలు అందుబాటులో ఉండవు.
ఎయిర్ ఇండియా గ్రూప్ ఈక్విటీలో రూ.2,059 కోట్ల పెట్టుబడి పెట్టి 25.1 శాతం వాటా తీసుకునేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ) కంపెనీ ప్రతిపాదన చేసింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రతి పాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్ కథ ముగిసిపోతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ తెలిపింది. పది సంవత్సరాల క్రితం ఎస్‌ఐఏతో కలిసి టాటా గ్రూప్ ఈ విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. 2013 లో టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ లు ఉమ్మడి వ్యాపారం గా దీన్ని ప్రారంభించారు. మరి ఈ విస్తారా ఎయిర్లైన్స్ విలీన ప్రక్రియపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.