Dharani
Dharani
భారతీయ రైల్వే శాఖ.. ట్రైన్ సర్వీస్‌లను విస్తరించడంతో పాటు.. అత్యాధునిక సేవలను అందించే ప్రణాళికలో భాగంగా.. వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా.. నేడు మరో 9 వందే భారత్ రైళ్లను.. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. త్వరలోనే మరిన్ని వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీయనున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల రాకతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గింది. ఈ రైళ్ల వేగం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కన్నా ఎక్కువ. అయితే 160 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో తయారు చేశారు. కానీ ప్రస్తుతం ట్రాక్‌ల పరిమితుల కారణంగా గరిష్ట వేగం గంటకు 130 కి.మీ.గా ఉంది త్వరలోనే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇక టికెట్ ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంది.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐఎఫ్‌సీ) వందే భారత్ కోచ్‌లను తయారు చేస్తుంది. ప్రస్తుతానికైతే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం సీటింగ్ కోచ్‌లను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే స్లీపర్ కోచ్‌లను కూడా తీసుకురానున్నారు. ఇక వందే భారత్ రైళ్లో ఉన్న సీసీటీవీ సర్వెలైన్స్ ఆధారంగా.. లోకో పైలెట్ ప్రతి కోచ్‌ను చూడవచ్చు. అలానే రైలు బయట భాగంలో కూడా 4 కెమరాలను ఏర్పాటు చేశారు.
అలానే రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదు.. ఎదురెదురుగా వచ్చే సమయంలో.. అవి ఒకదానికి ఒకటి గుద్దుకుని.. ప్రమాదాలు జరగకుండా నివారించేలా కవచ్ యాంటీ కొలిజన్ పరికరాలను వీటిల్లో అమర్చారు. ఇక వందే భారత్ రైళ్ల తయారీలో 85-90 శాతం దేశీయంగానే జరిగింది. కేవలం ఫోర్జ్డ్ వీల్స్, ఇరుసులను మాత్రమే విదేశాల నుంచి తెప్పించారు. గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించాలంటే ఫోర్జ్డ్ వీల్స్ అవసరం ఉంటుంది.
వందే భారత్ రైళ్లను ట్రైన్ సెట్ అంటారు. ఈ సెట్‌లో 8 లేదా 16 కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న రైళ్ల మాదిరి.. వీటిని వేరు చేయడానికి కుదరదు. వందే భారత్ రైళ్లకు లోకోమోటివ్‌లు అవసరం లేదు. నాలుగు యూనిట్లు నాలుగు స్వతంత్ర లోకోమోటివ్‌లుగా పనిచేస్తాయి. అలానే ప్రస్తుతం ఉన్న రైళ్ల మాదిరిగా.. ఒక యూనిట్ ఫెయిల్ అయితే రైలు ఆగిపోదు. అదే సంప్రదాయ రైళ్లలో అయితే లోకో విఫలమైతే రైలు నిలిచిపోతుంది.
రైళ్లలో ప్రతి రెండవ కోచ్‌లో మోటార్లు ఉంటాయి. 16 కోచ్‌ల వందే భారత్ ట్రైన్‌లో ఎనిమిది మోటారు కోచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి 840 కిలోవాట్ వరకు శక్తిని కలిగి ఉంటాయి. ఎనిమిది కోచ్ రైలు సెట్ కోసం సుమారుగా 7,000 కిలో పవర్ అందుబాటులో ఉంది. వందే భారత్ రైళ్లలో లోకోమోటివ్ కనిపించనప్పటికీ.. దీని శక్తి 1.8 లేదా 2 లోకోమోటివ్‌లకు సమానంగా ఉంటుంది
వందే భారత్ రైలును జీఎస్‌టీ లేకుండా తయారు చేయడానికి రూ.108 కోట్లు ఖర్చవుతుంది. వందే భారత్ రైళ్లలో వేగం, త్వరణం, భద్రత మెరుగ్గా ఉన్నందున.. వీటిని సంప్రదాయ రైలుతో పోల్చలేము. జర్మన్-డిజైన్ చేయబడిన లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌ఈ) కోచ్‌కి ఒక్కో కోచ్‌కు రూ2.5 కోట్లు, ఒక లోకోమోటివ్ కోసం రూ.12-15 కోట్లు ఖర్చవుతుంది.
ప్రయాణీకుల సౌకర్యానికి సంబంధించినంతవరకు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో పోల్చితే వందే భారత్ రైళ్లలో చాలా మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ప్రతి కోచ్‌లో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి సీటులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం సాకెట్ ఏర్పాటు చేశారు. రైళ్లలో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. డోర్స్ వాంటతటవే క్లోజ్ అవుతాయి. అలానే అన్ని డోర్స్ క్లోజ్ కాకపోతే రైలు కదలదు.