Budget 2024: మధ్యంతర బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే

లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి తాయిలాలు ప్రకటించేలేదు. మరి బడ్జెట్‌ తర్వాత వేటి ధరలు తగ్గనున్నాయి.. వేటి రేట్లు పెరగనున్నాయి అంటే..

లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి తాయిలాలు ప్రకటించేలేదు. మరి బడ్జెట్‌ తర్వాత వేటి ధరలు తగ్గనున్నాయి.. వేటి రేట్లు పెరగనున్నాయి అంటే..

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఫిబ్రవరి 1, గురువారం నాడు లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కనుక.. కేంద్రం నుంచి భారీగానే తాయిలాలు ఉంటాయని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు. కానీ కేంద్రం నుంచి అలాంటి ప్రకటనలు ఏవి రాలేదు. తాజా బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గానికి కాస్త ఊరట కలిగించగా.. వేతనజీవులకు మాత్రం నిరాశే ఎదురైంది. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపైనే దృష్టి పెట్టిన కేంద్రం ఆదాయపు పన్ను సహా ఇతర పథకాల జోలికి వెళ్లలేదు.

బడ్జెట్ అనగానే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు వేటి ధరలు తగ్గుతాయి.. వేటి ధరలు పెరుగుతాయి అనే అంశాన్నే ప్రధానంగా చూస్తారు. ఎందుకంటే ఇది వారిపై నేరుగా ప్రభావం చూపుతుంది కనుక. 2024 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం.. వీటి గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అంటే ఆ రేట్లు యథాతథంగానే ఉండనున్నాయి అని అర్థం. దాంతో జనాలు పోనిలే.. వేటి ధరలు పెరగలేదు అని ఊపిరి పీల్చుకున్నారు.

మధ్యంతర బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలమ్మ వీటి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ.. అంతకుముందే జనవరి 31న కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ తయారీలో ఉపయోగించే విడిభాగాల దిగుమతులకు సంబంధించి.. దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది 15 శాతంగా ఉండగా.. 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీకి మరింత మద్దతు అందించి ప్రోత్సహించడం, ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫోన్లను ఎగుమతి చేయడానికి ఉద్దేశించి కేంద్రం ఇలాంటి ప్రకటన చేసింది.

కేంద్రం తాజా నిర్ణయంతో.. వీటి ధరలు తగ్గుతాయి.

  1. మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే బ్యాటరీ కవర్లు,
  2. మెయిన్ లెన్స్,
  3. బ్యాక్ కవర్స్,
  4. యాంటెన్నా,
  5. సిమ్ సాకెట్స్,
  6. ఇతర ప్లాస్టిక్,
  7. మెటల్ మెకానికల్ ఐటెమ్స్ ధరలు దిగిరానున్నాయి.
  8. స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే

ఇదే సమయంలో ఫిబ్రవరి 1న కేంద్రం వేరుగా మరో కీలక ప్రకటన చేసింది. విమాన ఇంధనం ధరల్ని భారీగా తగ్గించింది. ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయెల్ ధరల్ని కిలో లీటరు మీద రూ. 1221 తగ్గించడం విశేషం. ఇక గత బడ్జెట్ అంటే 2023 సమయంలో చాలా వస్తువుల ధరల్ని తగ్గించింది కేంద్రం. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, ష్రింప్ ఫీడ్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వంటి ధరలు తగ్గాయి. సిగరెట్లు, ఎయిర్ ట్రావెల్, టెక్స్‌టైల్స్ వంటి ఉత్పత్తులు భారమయ్యాయి. కానీ ఈ సారి మాత్రం వేటి ధరల్ని తగ్గించలేదు.. పెంచలేదు.

ఇది కూడా చదవండి:

  1. కేంద్రం గుడ్ న్యూస్.. సొంతింటి కలను నెరవేర్చేందుకు బడ్జెట్ లో కీలక ప్రకటన!
  2. రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు.. ఇన్‌కమ్ ట్యాక్స్‌పై కీలక ప్రకటన
Show comments