10 పాసాయ్యారా.. మీకోసమే ఇది.. చాలా తక్కువ ఫీజుతో ట్రైనింగ్‌, వసతి.. జాబ్‌ పక్కా

త్వరగా సెటిల్‌ అవ్వాలనో.. లేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించకనో.. పది తర్వాత ఖాళీగా ఉంటున్నారా. అయితే మీ కోసమే ఇది. చాలా తక్కు ఫీజుతో ట్రైనింగ్‌, వసతి కల్పించి.. జాబ్‌ వచ్చేలా శిక్షణ ఇస్తుంది ఓ సంస్థ. ఆ వివరాలు..

త్వరగా సెటిల్‌ అవ్వాలనో.. లేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించకనో.. పది తర్వాత ఖాళీగా ఉంటున్నారా. అయితే మీ కోసమే ఇది. చాలా తక్కు ఫీజుతో ట్రైనింగ్‌, వసతి కల్పించి.. జాబ్‌ వచ్చేలా శిక్షణ ఇస్తుంది ఓ సంస్థ. ఆ వివరాలు..

చదువు అంటే అక్షరజ్ఞానంతో పాటు.. బతుకుదెరువు నేర్పేదిగా ఉండాలి అంటారు. కానీ నేటి కాలంలో చదువులు మాత్రం అలా లేవు. ఎంతసేపు పుస్తాకాల్లో ఉన్నది బట్టి పట్టి చదవడం తప్ప.. సమాజం తీరు ఎలా ఉంది.. బయట ఓ మనిషి బతకాలంటే.. తెలుసుకోవాల్సిన అంశాలేంటి అనే వాటిని పట్టించుకోకుండా.. పుస్తకాలల్లోని మ్యాటర్‌ని బుర్రలోకి పంప్‌ చేసే పనిలో ఉంది మన విద్యా వ్యవస్థ. మన ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌లో మార్పులు రావాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. స్కూలింగ్‌ పూర్తయ్యే నాటికే పిల్లలకు అనేక రకాల ఉపాధి కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వాలని వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సాహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు, ప్రభుత్వాలు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. ఎక్కడో కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే సాంప్రదాయ చదువుల బదులు.. జీవితంలో త్వరగా సెటిలయ్యే కోర్సుల వైపు చూస్తున్నారు. మీరు కూడా ఈ కోవకు చెంది ఉంటే.. పది పాసైతే.. మీకోసమే ఈ వార్త.

పదోతరగతి పాసై.. జీవితంలో త్వరగా సెటిల్‌ అవ్వాలనుకునేవారికి.. పై చదువులకు ఆర్థిక స్థాయి అంగీకరించని వారి కోసం ఓ ఎడ్యుకేషన్‌ సొసైటీ బంపరాఫర్‌ ప్రకటించింది. అతి తక్కువ ఫీజు తీసుకుని వసతి కల్పించడంతో పాటు.. శిక్షణ ఇచ్చి.. ఉద్యోగం వచ్చేలా చేస్తామని ప్రకటించింది. ఇంతకు ఆ సొసైటీ ఎక్కడ ఉంది.. ఎంత ఫీజు చెల్లించాలి.. వారు నేర్పించే కోర్సులు ఏంటి అనే వివరాల విషయానికి వస్తే..

చిత్తూరు జిల్లాలో గోవర్ధనం ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంది. ఇక చాలా తక్కువ ఫీజు తీసుకుని వసతి కల్పించడంతో పాటు.. ఆడ్వాన్స్‌డ్‌ మొబైల్ రిపేర్స్‌ కోర్సుకు సంబంధించి ట్రైనింగ్‌ ఇస్తారు. పైగా ఈ కోర్సు నేర్చుకోవడానికి అర్హత, వయసుతో సంబంధం లేదు. ఏడాదికి కేవలం 15 వేల రూపాయల నామమాత్రపు ఫీజుతో.. ట్రైనింగ్‌ ఇచ్చి.. పలు కంపెనీలల్లో జాబ్స్ సాధించేలా తీర్చి దిద్దుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ‍ట్రైనింగ్‌ ద్వారా రిపేర్‌కు వచ్చిన ఫోన్స్‌లో సమస్యను సులువుగా గుర్తు పట్టేసి, నిమిషాల్లో రిపేర్ చేయగలుగున్నారు.

ఇతర రాష్ట్రాల వారు కూడ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. శిక్షణ పూర్తైన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. దీని ద్వారా బయట కంపెనీల్లో జాబ్ పొందవచ్చు. లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కూడా ఉన్న చోటే కొనసాగించవచ్చు. అర్హత ఏమి లేకున్నా పర్వాలేదు.. కానీ పది,ఇంటర్,డిగ్రీ చదివినవారు ఉంటే కొద్దీ సులువుగా త్వరితగా శిక్షణను పూర్తి చేసుకోవచ్చు. ఒక బ్యాచ్‌కి 10-15 మంది వరకు శిక్షణ ఇస్తున్నారు.  జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ సంస్థ తోడుగా నిలుస్తున్నది.

Show comments