TRAI-Separate Recharge Plans For Voice, Data, SMS: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీగా తగ్గనున్న రీఛార్జ్‌ ధరలు..!

Recharge Plan: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీగా తగ్గనున్న రీఛార్జ్‌ ధరలు..!

TRAI-Separate Recharge Plans For Voice, Data, SMS: ఈనెల అనగా జూలై ప్రారంభంలో ప్రైవేటు టెలికాం కంపెనీలు.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

TRAI-Separate Recharge Plans For Voice, Data, SMS: ఈనెల అనగా జూలై ప్రారంభంలో ప్రైవేటు టెలికాం కంపెనీలు.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

జూలై నెల ప్రారంభంలో టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వీఐ కస్టమర్లకు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలన్ని.. వాటి రీఛార్జ్‌ ప్లాన్స్‌ మీద 11-25 శాతం వరకు రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై మొబైల్‌ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను పెంచగా.. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం పాత రేట్లను అలానే ఉంచింది. దాంతో చాలా మంది కస్టమర్లు జియో, ఎయిర్‌టెల్‌, వీఐ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ఈ నెలలోనే సుమారు లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం.. చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 4జీ టవర్లను వేసే పనిలో ఉంది. ఇదే జరిగితే.. మరి కొన్ని లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారతారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీఛార్జ్‌ ధరల పెంపు నేపథ్యంలో.. కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. మొబైల్ యూజర్లకు  త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పనుంది. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు అందించే మొబైల్‌ రీఛార్జి ప్లాన్‌లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాయిస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌లను తీసుకురావాలని భావిస్తోంది ట్రాయ్‌. దీనిపై వినియోగదారులు అభిప్రాయాలను కోరింది. ఆగస్టు నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని ట్రాయ్‌ చెప్పుకొచ్చింది.

‘కన్సల్టేషన్‌ ఆన్‌ రివ్యూ ఆఫ్‌ టెలికాం కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్స్‌ (టీసీపీఆర్‌) -2012’ ఓ సంప్రదింపులు పత్రాన్ని విడుదల చేసింది. ఈ కన్సల్టేషన్‌ పేపర్‌పై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలను చెప్పాలని, 23కల్లా అభ్యంతరాలుంటే తెలియజేయాలంటూ ట్రాయ్‌.. టెలికం సంస్థలకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం స్పెషల్‌ టారిఫ్‌, కాంబో వోచర్లకు ఉన్న 90 రోజుల గరిష్ఠ చెల్లుబాటు కాలాన్ని పొడిగించాలని ట్రాయ్‌ భావిస్తోంది. దీనిపై పరిశీలన చేస్తోందని సమాచారం.

ప్రస్తుతం టెలికాం కంపెనీలు.. వాయిస్, డేటా, ఎస్‌ఎంఎస్‌లను సౌకర్యాలన్నింటిని.. బండిల్డ్‌ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి. దీంతో చాలా మంది వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే వినియోగించుకుని డేటా వాడట్లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు, నార్మల్‌ ఫోన్‌ వాడే వారి విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుందని తెలుస్తోంది. దాంతో చాలా మంది కస్టమర్లు.. ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే డేటా, ఎస్‌ఎంఎస్‌, వాయిస్‌ కాలింగ్‌ కోసం ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలు తగ్గనున్నాయి అని సమాచారం.

Show comments