Vinay Kola
TRAI: టెలికాం సెక్టార్ నియమాలలో కొత్త మార్పులు వచ్చాయి. అక్టోబర్ 1 నుంచి అమలవుతున్నాయి.
TRAI: టెలికాం సెక్టార్ నియమాలలో కొత్త మార్పులు వచ్చాయి. అక్టోబర్ 1 నుంచి అమలవుతున్నాయి.
Vinay Kola
టెలికాం సెక్టార్ నియమాలలో అనేక కొత్త మార్పులు వచ్చాయి. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలవుతున్నాయి. ఈ కొత్త నియమాలు కస్టమర్‌లకు చాలా ఉపయోగపడతాయి. ఈ మార్పుల వలన మన ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ తెలుసుకోవడం చాలా సులభం. మొబైల్ సర్విస్ ఎలా ఉంది? ఎలాంటి ఇంటర్నెట్ సర్విస్ ఉంది? 2G, 3G, 4G లేదా 5G సేవలు అందుబాటులో ఉన్నాయా లేవా తెలుసుకోవడం చాలా సులభం. కొత్త నిబంధనల ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్‌లలో ఈ సమాచారాన్ని తప్పనిసరిగా పెట్టాలి. అందువలన కస్టమర్‌లు తమకు అవసరమయ్యే సర్విస్ ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీరు జియో సిమ్ వాడుతున్నారని అనుకుందాం. మీ లొకేషన్‌లో జియో 5జీ నెట్‌వర్క్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే.. మీరు కంపెనీ వెబ్‌సైట్ లోకి వెళ్ళి మీ లోకేషన్ ని ఎంటర్ చేయాలి. అప్పుడు అక్కడ 5జీ నెట్‌వర్క్ ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఉంటే ఉన్నట్లు చూపిస్తుంది. లేకపోతే లేదు అని చూపిస్తుంది.
అలాగే వినియోగదారులకు SMS ద్వారా మాత్రమే వెబ్ లింక్‌లనేవీ వస్తాయి. ట్రాయ్ టెలికాం ఆపరేటర్లు తప్పనిసరిగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం వైట్‌లిస్ట్ చేసిన లింక్‌లు మాత్రమే అనుమతించేలా చూసుకోవాలి. చాలా మందికి కూడా థర్డ్ పార్టీ లింకుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాంటి లింకులతో ఎస్ఎంఎస్ వస్తే దాన్ని తెలియకుండా క్లిక్ చేస్తారు. దాంతో ఆ లింక్ లు ప్రమదకార సైట్లలోకి తీసుకువెళతాయి. అందువల్ల ఫోన్లో డేటాని హ్యాకర్లు యాక్సెస్ చేసే అవకాశం ఉంది. దాంతో బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మాయం అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేగాక మన ప్రైవేట్ సమాచారం లీకయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ కొత్త నిబంధనలతో ఈ ముప్పు ఉండదని తెలుస్తుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వైర్‌లెస్, వైర్‌లైన్ సర్వీసుల క్వాలిటీ (QoS) ప్రమాణాలను కూడా అప్‌డేట్ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్ పర్ఫార్మెన్స్, నెట్‌వర్క్ అవైలబిలిటీ, కాల్ డ్రాప్ రేట్లు, వాయిస్ ప్యాకెట్ డ్రాప్ రేట్‌లు ఇంకా ప్రతి సమాచారాన్ని కూడా తమ వెబ్‌సైట్‌లలో పెట్టాలి. ప్రతి నెలా కచ్చితంగా అప్డేట్ చేయాలి. ఈ నిబంధనల వలన వినియోగాదారులు చాలా సౌకర్యంగా ఉంటారు. ఇక TRAI ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.