Vinay Kola
TRAI: ఫేక్ కాల్స్ చాలా ఎక్కువ ఐపోతున్నాయి. ఈ క్రమంలో టెలికాం శాఖ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది.
TRAI: ఫేక్ కాల్స్ చాలా ఎక్కువ ఐపోతున్నాయి. ఈ క్రమంలో టెలికాం శాఖ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది.
Vinay Kola
కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని టెలికాం శాఖ విజృంభిస్తుంది. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. దేశంలో చాలా మందిని కూడా ఫేక్ కాల్స్ అనేవి బాగా వేధిస్తున్నాయి. ఇక వాటిని కట్టడి చేసేందుకు టెలికాం శాఖ నడుము బిగించింది. ఇక రీసెంట్ గా టెలికాం డిపార్ట్‌మెంట్ ఏకంగా 1.77 కోట్ల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది. ఎందుకంటే ఇన్ని కోట్ల నెంబర్ లని కేవలం ఫేక్ కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించారు. దేశంలో ఏకంగా 122 కోట్ల మంది టెలికాం వినియోగదారులు ఉన్నారు. వారిని రక్షించేందుకు ట్రాయ్ (TRAI) సహకారం తీసుకుంది టెలికాం శాఖ. ఇక పోతే ట్రాయ్ గత నెలలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఆపరేటర్లు ఇప్పుడు మార్కెటింగ్, ఫేక్ కాల్‌లను స్వయంగా ఆపవచ్చు. దీంతో వైట్‌లిస్టింగ్ పని ఉండదు.
టెలికాం డిపార్ట్‌మెంట్ ప్రకారం.. తెలుస్తున్నది ఏమిటంటే.. దాదాపు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ ఆగిపోతున్నాయి. ప్రజల ఫిర్యాదులు అందుకున్న టెలికాం డిపార్ట్మెంట్ జెట్ స్పీడులో ముందుకు వెళుతుందనే చెప్పాలి. ఇప్పటికీ చర్యలు చేపట్టి కేవలం ఐదు రోజులు అవుతుంది. కేవలం ఈ ఐదు రోజుల్లోనే సుమారు 7 కోట్ల కాల్‌లను నిలిపివేసింది. ఫేక్ కాల్స్ చేసేవారిని టెలికాం డిపార్ట్‌మెంట్ ఆపడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. అంతకుముందు కూడా లక్షల సిమ్ కార్డులను క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక నుండి, కాలర్‌లు వైట్‌లిస్ట్ చేయబడిన టెలి మార్కెటింగ్ కాల్‌లను మాత్రమే రిసీవ్ చేసుకుంటారు.కావాలంటే మీరు గమనించండి.. మీరు లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటే మీకు ఫేక్ కాల్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రికవరీ ఏజెంట్లు వివిధ రకాల నెంబర్లతో కాల్స్ చేసి విసిగిస్తూ ఉంటారు. ఇక నుంచి ఆ విసుగు ఉండదు. ఎలాంటి వేధింపులు ఉండవు. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటి ఫేక్ కాల్స్ రానే రావు. కాబట్టి భయం లేకుండా ఉండవచ్చు.
ఇక తాజాగా ఫేక్ నెంబర్లతో కూడిన దాదాపు 11 లక్షల బ్యాంక్ అకౌంట్ లను, పేమెంట్ వాలెట్లను ఫ్రీజ్ చేశాయమని మినిస్ట్రీ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఇలాంటి చాలా సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)లో పనిచేస్తున్న నలుగురు టెలికాం సర్వీస్ ఆపరేటర్లు (టీఎస్‌పీలు) 45 లక్షల ఇంటర్నేషనల్ ఫేక్ కాల్‌లను టెలికాం నెట్‌వర్క్‌కు చేరకుండా కట్టడి చేశారు. ఇదీ సంగతి. ఈ విధంగా టెలికాం డిపార్ట్ మెంట్ ట్రాయ్ సహాయంతో ఫేక్ కాల్స్ ని, ఫేక్ సిమ్ కార్డ్స్ ని క్యాన్సిల్ చేయడానికి కంకణం కట్టుకుంది. ఇక టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.